Chief Minister: బెంగళూరులో వీసా కార్యాలయం ఏర్పాటు చేయండి
ABN , First Publish Date - 2023-02-15T11:00:14+05:30 IST
ప్రపంచ ఐటీబీటీ రాజధానిగా ఖ్యాతి గడించిన బెంగళూరులో అమెరికా వీసా కార్యాలయాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి
- అమెరికా రాయబారులకు సీఎం వినతి
బెంగళూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఐటీబీటీ రాజధానిగా ఖ్యాతి గడించిన బెంగళూరులో అమెరికా వీసా కార్యాలయాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు. దేశ అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్, చెన్నైలోని అమెరికా కాన్సులేట్ జనరల్ జూడిత్ రెవిన్ నాయకత్వంలోని బృందం ముఖ్యమంత్రిని మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ప్రస్తుతం అమెరికా వీసా కార్యాలయం చెన్నైలో ఉన్నందున నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బెంగళూరు నుంచి అమెరికాకు ప్రతిరోజూ 5వేల మంది ప్రయాణం చేస్తున్నారన్నారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారని సీఎం వివరించారు. సాధ్యమైనంత త్వరగా వీసా కార్యాలయాన్ని బెంగళూరు(Bangalore)లో ప్రారంభించాలని ఈ బృందాన్ని కోరారు. ఐటీబీటీ రంగంలోనూ అంతరిక్ష రంగంలోనూ వైమానిక రక్షణ ఉత్పత్తుల రంగంలోనూ పెట్టుబడులు గణనీయంగా తరలివస్తున్న నేపథ్యంలో వి దేశీయుల రాకపోకలు అధికమయ్యాయని ఆయన వివరించారు. సిలికాన్ వ్యాలీని తాము తొలిసారి సందర్శిస్తున్నానని, వీసా కార్యాలయాన్ని ప్రా రంభించే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కర్ణాటకలో 650కు పైగా అమెరికన్ కంపెనీ లు పనిచేస్తున్నాయన్నారు. అమెరికా రాయబారుల గౌరవార్థం సీఎం సచివాలయంలో తేనీటి విందును ఏర్పాటు చేశారు.