Chief Minister: ఆ వ్యాపారులపై గుండా చట్టం..

ABN , First Publish Date - 2023-05-18T08:39:23+05:30 IST

రాష్ట్రంలో సారా నిరోధానికి కఠిన చర్యలు చేపట్టాలని, అవసరమైతే సారా వ్యాపారులపై గూండా చట్టం ప్రయోగించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పోలీసు

Chief Minister:  ఆ వ్యాపారులపై గుండా చట్టం..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సారా నిరోధానికి కఠిన చర్యలు చేపట్టాలని, అవసరమైతే సారా వ్యాపారులపై గూండా చట్టం ప్రయోగించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కల్తీసారాకు 22 మంది మృతి చెందిన సంఘటనల నేపథ్యంలో సచివాలయంలో బుధవారం ఉదయం పోలీసు ఉన్నతాధికారులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా కల్తీమద్యం విక్రయాలపై ఫిర్యాదు చేయడానికి అమలులో ఉన్న 10581 టోల్‌ ఫ్రీ నెంబర్‌ గురించి ప్రజలందరికీ తెలిసేలా అన్ని జిల్లాల్లోనూ ప్రకటనలు జారీ చేయాలన్నారు. అంతేకాకుండా ఎక్సైజ్‌ విభాగం పోలీసులు ప్రత్యేకంగా వాట్సప్‌ నెంబర్లు ప్రకటించి వాటి ద్వారా సారా విక్రయాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని కోరారు. జిల్లాలవారీగా సారా నిరోధానికి చేపడుతున్న చర్యల గురించి ఎప్పటికప్పుడు ఎక్సైజ్‌ విభాగం అధికారులు హోంశాఖ కార్యదర్శికి నివేదిక పంపాలని ఆదేశించారు.సారా, మాదక ద్రవ్యాలు నిరోధించే దిశగా జిల్లా కలెక్టర్లు ప్రతి సోమవారం అధికారులతో సమీక్షా సమావేశా లు జరపాలని ఆదేశించారు. ఆసమావేశాల్లో టాస్మాక్‌ స్థానిక శాఖ అధికారులు తప్పకుండా పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశాల నిర్వహణ గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్‌ జారీ చేయాలన్నారు.

విద్యా సంస్థల వద్ద ప్రచారం...

సారా, మద్యం, మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు గురించి పాఠశాలలు, కళాశాలల వద్ద అవగాహన ప్రచార కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో తసారా, మాదక ద్రవ్యాల నిరోధక ప్రచారాలను భారీ స్థాయిలో చేపట్టాలన్నారు. ఇక పరిశ్రమలలో స్పిరిట్‌, ఇథనాల్‌ వినియోగాలపై తీవ్ర నిఘా వేయాలని సూచించారు. చక్కెర తదితర కర్మాగారాలలో వెలువడే స్పిరిట్‌, ఇథనాల్‌ ఏయే అవసరాలకు వినియోగిస్తున్నారో ఎక్సైజ్‌ విభాగం డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ ప్రతివారం పరిశీలించాలని, అవసరమైతే సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేయాలని తెలిపారు.

గూండాచట్టం ప్రయోగం...

సారా వ్యాపారాలు సాగించే వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను అధికారులు కల్పించాలని, భవిష్యత్‌లో వారు సారా తయారీ, అమ్మకాలపై దృష్టి సారించని విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, హోంశాఖ కార్యదర్శి అముద, డీజీపీ శైలేంద్రబాబు, పోలీసు శాఖ శాంతి భద్రతల విభాగం అదనపు సంచాలకుడు కె.శంకర్‌, ఎక్సైజ్‌ విభాగం అదనపు సంచాలకుడు మహే్‌షకుమార్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-18T09:29:33+05:30 IST