Chennai: మా మంత్రిని తొలగించేందుకు మీరెవరు?

ABN , First Publish Date - 2023-07-05T09:01:49+05:30 IST

మంత్రి సెంథిల్‌బాలాజి(Minister Senthilbalaji)ని డిస్మిస్‌ చేయాలని ప్రతిపాదించిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)కి వ్యతిరేకంగా

Chennai: మా మంత్రిని తొలగించేందుకు మీరెవరు?

- గవర్నర్‌కు వ్యతిరేకంగా సేలంలో పోస్టర్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మంత్రి సెంథిల్‌బాలాజి(Minister Senthilbalaji)ని డిస్మిస్‌ చేయాలని ప్రతిపాదించిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)కి వ్యతిరేకంగా డీఎంకే ఐటీ విభాగం నాయకులు సేలంలో అతికించిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. మా మంత్రిని తొలగించడానికి మీరెవరు? అంటూ ఆ పోస్టర్‌లో ముద్రించి ఉంది. అంతేకాకుండా కేంద్ర మంత్రివర్గంలో 44 శాతం మంది వివిధ అవినీతి కేసుల్లో నిందితులుగా ఉన్నారని, వారిని కూడా తొలగించమంటూ రాష్ట్రపతి, ప్రధానికి గవర్నర్‌ ప్రతిపాదన చేయగలరా? అంటూ ఆ పోస్టర్‌లో ప్రశ్నించారు. సేలం నగరమంతటా ఉన్న ఆ పోస్టర్లను స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Updated Date - 2023-07-05T09:01:49+05:30 IST