Chennai: చెన్నైలో.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

ABN , First Publish Date - 2023-04-15T11:22:55+05:30 IST

రాజధాని నగరం చెన్నై(Chennai)లో శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

Chennai: చెన్నైలో.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

పెరంబూర్‌(చెన్నై): రాజధాని నగరం చెన్నై(Chennai)లో శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరూర్‌(Karur) పరమత్తివేలూరు, ఈరోడ్‌(Erode)లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. అలాగే వేలూరు, సేలంలలో 39, మదురై విమానాశ్రయం, తిరుపత్తూర్‌, తిరుచ్చిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక, చెన్నై ఈ ఏడాది వేసవి తొలిసారిగా శుక్రవారం చెన్నై విమానాశ్రయంలో 38.3 డిగ్రీల అత్యతిక ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండ్రోజులు ఎండలు ఇలాగే కొనసాగే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం తెలియజేసింది.

Updated Date - 2023-04-15T11:22:55+05:30 IST