Share News

Chennai: భద్రత కలిగిన నగరాల్లో చెన్నైకి మొదటి స్థానం

ABN , First Publish Date - 2023-10-26T12:41:31+05:30 IST

దేశంలో భద్రత కలిగిన మహానగరాల జాబితాలో చెన్నై(Chennai) మొదటి స్థానంలో నిలిచింది. ‘గూగుల్‌’ సంస్థ సాఫ్ట్‌వేర్‌

Chennai: భద్రత కలిగిన నగరాల్లో చెన్నైకి మొదటి స్థానం

పెరంబూర్‌(చెన్నై): దేశంలో భద్రత కలిగిన మహానగరాల జాబితాలో చెన్నై(Chennai) మొదటి స్థానంలో నిలిచింది. ‘గూగుల్‌’ సంస్థ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, బోస్నియా - హెర్జేగొవీనా, బంజాలూకా విశ్వవిద్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లేటన్‌ ఆడమోవిక్‌... సెర్బియాకు చెందిన ‘నంబియో’ అనే ప్రైవేటు సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా ఆయన, ప్రపంచంలోని ముఖ్యనగరాల భద్రతపై సర్వే నిర్వహించారు. పలు సంస్థలు నిర్వహించిన సర్వేల ఆధారంగా, విధులకు వెళ్లే మహిళల భద్రత తదితర అంశాలపై సర్వే చేపట్టారు. ఆ సర్వే వివరాలు ఇటీవల విడుదల కాగా, భద్రత కలిగిన మహానగరాల జాబితాలో చెన్నై జాతీయస్థాయిలో మొదటి స్థానంలోను, అంతర్జాతీయస్థాయిలో 127వ స్థానంలో నిలిచింది. ఇక, ఈ ఏడాది ప్రారంభంలో ‘అవతార్‌’ అనే సంస్థ జీవన పరిస్థితులు, భద్రత, మహిళలకు ప్రాధాన్యం కల్పించే అంశాలు తదితరాలపై సర్వే నిర్వహించగా, అందులో 10 లక్షల మందికి పైగా ప్రజలు ఉన్న నగరాల జాబితాలో 78.4 పాయింట్లతో చెన్నై మహిళలకు అత్యంత భద్రత కల్పించే నగరంగా ఉన్నట్లు ప్రకటించారు. తాజాగా, దేశంలోనే భద్రత కలిగిన నగరంగా చెన్నై ఎంపిక కావడంపై నగర పోలీసుశాఖ హర్షం ప్రకటించింది. భవిష్యత్తులోనూ ప్రజలకు తగిన భద్రత కల్పించేలా కృషి చేస్తామని నగర పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌రాయ్‌ రాథోడ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-26T12:41:31+05:30 IST