Cheetahs: మరో రెండు చిరుతలు పట్టివేత
ABN , First Publish Date - 2023-02-21T13:18:03+05:30 IST
మైసూరు(Mysore) జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో మరో రెండు చిరుతలు(Cheetahs) బోనుకు చిక్కాయి. వరుణ హోబళి
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మైసూరు(Mysore) జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో మరో రెండు చిరుతలు(Cheetahs) బోనుకు చిక్కాయి. వరుణ హోబళి మైసూరు మండకళ్ళి విమా నాశ్రయానికి సమీపానగల మరశ గ్రామంలో నాలుగేళ్ల చిరుత బోనుకు చిక్కింది. వారంక్రితం చిరుత సంచారాన్ని గుర్తించడంతో గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కృష్ణప్పకు చెందిన భూమిలో అటవీ సిబ్బంది బోను అమర్చారు. ఆదివారం సుమారు నాలుగేళ్ల చిరుత బోనుకు చిక్కింది. ఆర్ ఎఫ్‌ఓ సురేంద్ర, డీఆర్‌ఎఫ్‌ఓ విజయకుమార్‌ల నేతృత్వంలో కార్యాచరణ చేపట్టారు. చిప్ అమర్చిన అనంతరం తిరిగి అడవిలోకి చిరుతను వదిలిసినట్టు మైసూరు డీసీ ఎఫ్ డాక్టర్ కేఎన్ బసవరాజు వెల్లడించారు. కాగా హుణ సూరు తాలూకా హబ్బనకుప్పె గ్రామంలో 15 రోజుల వ్యవధిలో మరొక చిరుత బోనుకు చిక్కింది. ఆవును తినేం దుకు వచ్చిన చిరుత చివరకు బోనులో చిక్కుకుంది. పట్టుబడిన చిరుతను బండీపురలోని అటవీ ప్రాంతంలో వది లేసినట్టు ఆర్‌ఎఫ్‌ఓ నందకుమార్ వెల్లడించారు. మైసూరు జిల్లాలో గత ఏడాదిలో 65కుపైగా చిరుతలను బంధించి అడవులలో వదిలారు. టీ నరసీపుర, హుణసూరు ప్రాం తాల్లోనే చిరుతలు ఎక్కువగా పట్టుబడ్డాయి.