Varanasi Airport: వారాణాసి విమానాశ్రయంలో గందరగోళం

ABN , First Publish Date - 2023-01-09T19:50:54+05:30 IST

దట్టమైన పొంగమంచు, వెలుతురు సరిగా లేకపోడంతో వారణాసి విమానాశ్రయం(Varanasi Airport)లో పలు విమానాలు నిలిచిపోవడం, కొన్ని విమానాలను దారి మళ్లించడంతో వారణాసి విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడింది.

Varanasi Airport: వారాణాసి విమానాశ్రయంలో గందరగోళం

వారణాసి: దట్టమైన పొంగమంచు, వెలుతురు సరిగా లేకపోడంతో వారణాసి విమానాశ్రయం(Varanasi Airport)లో పలు విమానాలు నిలిచిపోవడం, కొన్ని విమానాలను దారి మళ్లించడంతో వారణాసి విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడింది. విమానాశ్రయంలో పెద్ద ఎత్తున చిక్కుకుపోయిన ప్రయాణికులు విమానాలకు సంబంధించిన సమాచారం కోసం నానా అవస్థలు పడ్డారు. కస్టమర్ సర్వీస్ డెస్కుల వద్ద ప్రయాణికులు పడిగాపులు పడుతున్న వీడియోలు సోషల్ మీడియా(Social Meadia)ను ముంచెత్తాయి.

ముంబై-వారణాసి విమానాన్ని రాయపూర్‌కు మళ్లించినట్టు విస్తారా ఎయిర్‌లైన్స్(Vistara Airlines) ట్వీట్ చేసింది. అలాగే, వారాణాసి విమానాశ్రయంలో వెలుతురు సరిగా లేని కారణంగా ఢిల్లీ-వారణాసి విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించినట్టు తెలిపింది. సోమవారం ఉదయం నుంచి ఒక్క విమానం కూడా ల్యాండ్ కాకపోవడంతో వారణాసి విమానాశ్రయంలో నెల రోజుల బిడ్డతో తన భార్య చిక్కుకుపోయిందని ఓ యూజర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. దయచేసి తన భార్య, శిశువుకు సాయం చేయాలని అభ్యర్థించాడు. తన బేబీకి ముంబైలో డాక్టర్ కన్సల్టేషన్ అవసరమని, ఈ రోజు అక్కడికి వెళ్లేందుకు విమానం దొరికుతుందనే అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Updated Date - 2023-01-09T19:52:43+05:30 IST