Bhim Army Chief: భీమ్ ఆర్మీ చీఫ్‌‌‌పై దాడి... శరీరాన్ని తాకిన బుల్లెట్..

ABN , First Publish Date - 2023-06-28T18:55:50+05:30 IST

భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ - కాన్షీరామ్ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ బుధవారంనాడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని సహరాన్‌పూర్ జిల్లాలో ఆయన కాన్వాయ్‌పై సాయుధులు కొందరు దాడిచేశారు.

Bhim Army Chief: భీమ్ ఆర్మీ చీఫ్‌‌‌పై దాడి... శరీరాన్ని తాకిన బుల్లెట్..

షహరాన్‌పూర్: భీమ్ ఆర్మీ చీఫ్ (Bhim Army Chief), ఆజాద్ సమాజ్ పార్టీ - కాన్షీరామ్ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ (Chandrashekhar Aazad) బుధవారంనాడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar pardesh)లోని సహరాన్‌పూర్ జిల్లాలో ఆయన కాన్వాయ్‌పై సాయుధులు కొందరు దాడిచేశారు. కాల్పులకు దిగారు.

సంఘటన వివరాల ప్రకారం, సహరాన్‌పూర్ జిల్లా దేవ్‌బంద్ ప్రాంతంలో సాయుధ దుండగులు చంద్రశేఖర్ ఆజాద్ కారుపై దాడి చేశారు. ఈ దాడులో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఒక బుల్లెట్ ఆయనను తాకుతూ వెళ్లిపోయింది. కారులో వచ్చిన సాయుధులు కొందరు చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై కాల్పులు జరిపారని, ఒక బుల్లెట్ ఆయనను తాకుతూ వెళ్లిందని ఎస్ఎస్‌పీ డాక్టర్ విపిన్ టాడా తెలిపారు. వైద్యచికిత్స కోసం సీహెచ్‌సీకి ఆయనను తరలించామని, ప్రస్తుతం బాగానే ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అన్నారు.

Updated Date - 2023-06-28T18:55:50+05:30 IST