Central team: డెల్టా జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

ABN , First Publish Date - 2023-02-09T07:30:07+05:30 IST

భారీవర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు డెల్లా జిల్లాల్లోని వర్షబాధిత ప్రాంతాల్లో ఒకటైన నాగపట్టణం జిల్లాలో కేంద్ర బృందం బుధవారం

Central team: డెల్టా జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

- రైతుల నుంచి వినతుల స్వీకరణ

ప్యారీస్‌(చెన్నై, ఫిబ్రవరి 8: భారీవర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు డెల్లా జిల్లాల్లోని వర్షబాధిత ప్రాంతాల్లో ఒకటైన నాగపట్టణం జిల్లాలో కేంద్ర బృందం బుధవారం పర్యటించింది. డెల్టాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ రైతు లు తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి రైతులను ఆదుకునేలా చర్య లు తీసుకోవాలని కోరింది. ఇప్పటికే తిరువారూరు, నాగపట్టణం తదితర జిల్లాల్లో మంత్రులు, అధికారుల బృందం పర్యటించి ఇచ్చిన నివేదిక పరిశీలించిన ముఖ్యమంత్రి(Chief Minister) హెక్టారుకు రూ.20 వేల చొప్పున, లేత పైరుకు హెక్టారుకు రూ.3 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అదేవిధంగా 22 శాతం మేరకు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రధాని మోదీకి ఈనెల 5న స్టాలిన్‌ లేఖ రాసారు.. ఈ నేపథ్యంలో కావేరి డెల్టా జిల్లాలో వర్ష బాధిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసేందుకు యూనూస్‌ ప్రభాకర్‌ బోయాతో కూడిన ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం బుధవారం ఉదయం నాగపట్టణం జిల్లాలోని వేదారణ్యం, తలైనాయిరు తదితర ప్రాంతా ల్లో పర్యటించింది. కేంద్ర బృందంతోపాటు నాగపట్టినం జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ తంబురాజ్‌(Collector Arun Tamburaj), వ్యవసాయ శాఖ జేడీ ఆఖండరావు తదితరులున్నారు. తలైనాయర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు తరలించిన ధాన్యాన్ని పరిశీలించింది. ఈ బృందం పంట నష్టంపై కేంద్రానికి నివేదిక అందజేసిన తర్వాత కేంద్రం నష్టపోయిన రైతులకు సాయం చేసే అవకాశముంది.

Updated Date - 2023-02-09T07:30:09+05:30 IST