Delhi: జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది

ABN , First Publish Date - 2023-07-27T17:09:35+05:30 IST

జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. గత కొద్ది కాలంగా జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా రకరకాలైన చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. వీటికి ఫుల్‌స్టాప్ పెడుతూ పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టమైన ప్రకటన వెల్లడించింది. జమిలీ ఎన్నికలు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం కష్టమని పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పేసింది.

Delhi: జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది

ఢిల్లీ: జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. గత కొద్ది కాలంగా జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా రకరకాలైన చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. వీటికి ఫుల్‌స్టాప్ పెడుతూ పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టమైన ప్రకటన వెల్లడించింది. జమిలి ఎన్నికలు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం కష్టమని పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పేసింది.

జమిలి ఎన్నికలపై రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వివరాలు వెల్లడించారు. ‘‘ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అంత ఈజీ కాదు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ అందుకు అనేక కీలక అవరోధాలు, అడ్డంకులు కూడా ఉన్నాయి. కనీసం ఐదు కీలక రాజ్యాంగ సవరణలు అవసరం. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఏకాభిప్రాయం సాధించాలి. పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీపాట్స్ మిషన్స్ అవసరం. అందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పనిచేయవు. ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్దఎత్తున డబ్చు ఖర్చు చేయాలి. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు భారీగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కేంద్ర సిబ్బంది, న్యాయ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపింది. తదుపరి రోడ్ మ్యాప్ రూపకల్పనకై ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉంది.’’ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు.

Updated Date - 2023-07-27T17:17:50+05:30 IST