Cancellation of trains: ఆ మార్గంలో 7 నెలలపాటు రైళ్ళ రద్దు

ABN , First Publish Date - 2023-06-01T11:58:39+05:30 IST

చెన్నై బీచ్‌ - వేళచ్చేరి ప్రాంతాల మధ్య నడిచే ఎంఆర్‌టీఎస్‌ రైళ్ళ సర్వీసులను బీచ్‌ - చేపాక్కం ప్రాంతాల మధ్య ఏడు నెలల పాటు రద్దు చేశారు. ఈ

Cancellation of trains: ఆ మార్గంలో 7 నెలలపాటు రైళ్ళ రద్దు

అడయార్‌(చెన్నై): చెన్నై బీచ్‌ - వేళచ్చేరి ప్రాంతాల మధ్య నడిచే ఎంఆర్‌టీఎస్‌ రైళ్ళ సర్వీసులను బీచ్‌ - చేపాక్కం ప్రాంతాల మధ్య ఏడు నెలల పాటు రద్దు చేశారు. ఈ రైలు సర్వీసులు జూన్‌ 1వ తేదీ నుంచి చెన్నై బీచ్‌(Chennai Beach) నుంచి కాకుండా చెన్నై చేప్పాక్కం - వేళచ్చేరి ప్రాంతాల మధ్య నడుపనున్నారు. బీచ్‌ - ఎగ్మోర్‌ ప్రాంతాల మధ్య నాలుగో బ్రాడ్‌ గేజ్‌ ట్రాక్‌ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు ఆటంకం కలగకుండా రైలు సర్వీసులను చెప్పాక్కం నుంచి నడపాలని దక్షణి రైల్వే నిర్ణయించింది. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళే అనేక రైళ్ళు చెన్నై సెంట్రల్‌ నుంచి బయలుదేరి వెళుతున్నాయి. దీంతో ఈ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఏర్పడుతుంది. దీంతో చెన్నై ఎగ్మోర్‌(Chennai Egmore), తాంబరం, చెంగల్పట్టు స్టేషన్ల నుంచి నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. అయితే, బీచ్‌ నుంచి ఎగ్మోర్‌ వరకు బ్రాడ్‌ గేజ్‌ మార్గాలు మూడున్నాయి. దీంతో నాలుగో మార్గాన్ని నిర్మించేందుకు దక్షిణ రైల్వే ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపగా సమ్మతించింది. ఈ మార్గం నిర్మాణం కోసం కేంద్రం కూడా రూ.96.70 కోట్లను కేటాయించింది. దీంతో ఈ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో బీచ్‌ - వేళచ్చేరి ప్రాంతాల మధ్య నడిచే ఎంఆర్‌టీఎస్‌ రైలు సర్వీసులను ఈ మార్గంలో వచ్చే యేడాది జనవరి ఏడో తేదీ వరకు రద్దు చేసింది. చేప్పాక్కం - వేళచ్చేరి ప్రాంతాల మధ్యే నడపనుంది.

Updated Date - 2023-06-01T11:58:39+05:30 IST