Amitabh Bachan : చెప్పులు లేకుండా నడిచిన అమితాబ్ బచ్చన్

ABN , First Publish Date - 2023-08-17T13:55:52+05:30 IST

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ చెప్పులు లేకుండా నడవడం అందరినీ ఆకట్టుకుంది. తన కుమారుడు అభిషేక్ బచ్చన్ నటించిన సినిమా ‘ఘూమర్’ శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Amitabh Bachan : చెప్పులు లేకుండా నడిచిన అమితాబ్ బచ్చన్

ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ చెప్పులు లేకుండా నడవడం అందరినీ ఆకట్టుకుంది. తన కుమారుడు అభిషేక్ బచ్చన్ నటించిన సినిమా ‘ఘూమర్’ శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలుపు రంగు వస్త్రాలు ధరించిన అమితాబ్ భద్రతా సిబ్బందితో కలిసి ముంబైలోని ఈ దేవాలయాన్ని సందర్శించారు. అర్చకులు ఆయనకు శేష వస్త్రాన్ని, తీర్థ, ప్రసాదాలను అందజేశారు.

అమితాబ్ బచ్చన్ సిద్ధి వినాయకుడిని దర్శించుకుని, పూజలు చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆయన అత్యంత భక్తిశ్రద్ధలతో, కాళ్లకు చెప్పులు లేకుండా ఈ దేవాలయం ప్రాంగణంలో నడవడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

‘ఘూమర్’ సినిమాలో అభిషేక్ బచ్చన్ కోచ్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను తాను రెండుసార్లు చూశానని, ప్రతి ఫ్రేమ్ చాలా బాగుందని అమితాబ్ బచ్చన్ సామాజిక మాధ్యమాల్లో రాసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి :

Flesh-eating bacteria : ఒంట్లో మాంసాన్ని తినేసే బాక్టీరియా.. ముగ్గురి మృతి..

Fact Check : ఇస్రో శాస్త్రవేత్తలకు జీతాలివ్వడం లేదా?

Updated Date - 2023-08-17T13:55:52+05:30 IST