Golden Temple Gurbani: గుర్బానీపై చట్ట సవరణకు సీఎం సమాయత్తం.. ఎస్జీపీసీ వార్నింగ్..!

ABN , First Publish Date - 2023-06-19T17:23:14+05:30 IST

స్వర్ణ దేవాలయానికి చెందిన గుర్బానీ అంశం పంజాబ్‌లో రాజకీయ వేడి రగల్చింది. సిక్కు గురుద్వారా చట్టానికి కొత్తగా క్లాజ్ తీసుకువస్తున్నామని, గుర్బానీ అందరికీ ఉచితంగా అందుబాటులోకి తెస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చేసిన ప్రకటన ఈ వివాదానికి కారణమైంది. సీఎం ప్రకటనపై శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ ఆక్షేపణ వ్యక్తం చేసింది.

Golden Temple Gurbani: గుర్బానీపై చట్ట సవరణకు సీఎం సమాయత్తం.. ఎస్జీపీసీ వార్నింగ్..!

పంజాబ్: స్వర్ణ దేవాలయానికి చెందిన గుర్బానీ (Gurbani) అంశం పంజాబ్‌లో ఒక్కసారిగా రాజకీయ వేడి రగల్చింది. సిక్కు గురుద్వారా చట్టానికి కొత్తగా క్లాజ్ తీసుకువస్తున్నామని, ఇందువల్ల స్వర్ణదేవాలయానికి చెందిన గుర్బానీ అందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ (Bhagwant Singh Mann) చేసిన ప్రకటన ఈ వివాదానికి కారణమైంది. సీఎం ప్రకటనపై శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (SGPC) తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఇది ఎస్‌జీపీసీకి చెందిన అంశమని, దీనిని రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించింది.

ఏమిటీ వివాదం? ఎవరి వాదన ఏమిటి?

గుర్బానీ అంటే పంజాబీలకు పవిత్రమైన శ్లోకం అని అర్ధం. హర్మీందర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం) నుంచి దీన్ని ప్రతిరోజూ ప్రసారం చేస్తుంటారు. ఇంతవరకూ సిక్కుల 'ఎపెక్స్ బాడీ' అయిన ఎస్‌జీపీసీకి ఈ గుర్బానీ ప్రసార హక్కులు ఉన్నారు. బాదల్ కుటుంబానికి చెందిన పీటీసీ నెట్‌వర్క్‌కు గుర్బానీ ప్రసార హక్కులు గతంలో కట్టబెట్టారు. తాజాగా గుర్బానీని అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసారం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా గురుద్వారా-1925 చట్టాన్ని సవరిస్తామని, సవరణ బిల్లును ఈనెల 20వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఓ ట్వీట్‌లో ప్రకటించారు. చాలాకాలంగా భక్తుల నుంచి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా సిక్కు గురుద్వారా చట్టానికి కొత్త క్లాజ్ చేర్చడం ద్వారా, అందిరికీ గుర్బానీ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. కాగా, ఈ చట్టం అమల్లోకి వస్తే పీటీసీ ఏకఛత్రాధిపత్యానికి తెరపడుతుంది. అన్ని టెలివిజన్ ఛానెళ్లు గుర్బానీని ఉచితంగా ప్రసారం చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

ఎస్‌జీపీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత...

కాగా, సీఎం నిర్ణయంపై ఎస్‌జీపీసీ అధ్యక్షుడు హర్జీందర్ సింగ్ ధామ్ మండిపడ్డారు. సిక్కు గురుద్వారా చట్టం-1925లో చాలా స్పష్టంగా రాజకీయ జోక్యం కుదరదని చెప్పడం జరిగిందన్నారు. ఢిల్లీలో కూర్చున్న పెద్దల మెప్పుకోసం మతానికి రాజకీయ రంగు పులుముతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీషియన్‌కు ముందే దీనిపై ఎన్‌జీపీసీ డ్రాఫ్టింగ్ జరిపిందని, దానిని సవరించరాదని స్పష్టం చేశారు. కాగా, గుర్బానీపై చట్ట సవరణకు ఎస్‌పీజీసీ ఓవైపు నిరసన వ్యక్తం చేస్తుండగా, సీఎం మాన్ మాత్రం ఈనెల 20న చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గుర్బానీ చుట్టూ తలెత్తిన వివాదం ఎలాంటి కీలక మలుపులు తిరగనుందనేది ఆసక్తికరంగా మారింది.


******************************

ఇవి కూడా చదవండి..

******************************

Gandhi peace prize row : రూ.కోటి అవార్డు సొమ్ము నిరాకరించిన గీతాప్రెస్

******************************

Bus Accident: రెండు బస్సులు ఢీకొని ఇద్దరు మృతి, 70 మందికి గాయాలు

******************************

KSRTC: వామ్మో.. కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో లేడీస్‌కు ఫ్రీ జర్నీ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందో చూడండి..!



Updated Date - 2023-06-19T17:49:26+05:30 IST