BBMP: మార్చి 3న బీబీఎంపీ బడ్జెట్
ABN , First Publish Date - 2023-02-22T12:47:58+05:30 IST
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ల తరహాలోనే బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) బడ్జెట్ కూడా పన్నుపోటు లేని ప్రజాకర్షక బడ్జెట్ కావచ్చునని నిపుణులు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ల తరహాలోనే బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) బడ్జెట్ కూడా పన్నుపోటు లేని ప్రజాకర్షక బడ్జెట్ కావచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 3న బీబీఎంపీ బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు. ప్రస్తుతం బీబీఎంపీలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో నగర పరిధిలోని 28 శాసనసభ నియోజకవర్గాల ఎమ్మెల్యేల సలహాలతోనే బడ్జెట్‌కు అధికారులు రూపకల్పన చేస్తున్నారు. నగర జిల్లా ఇన్‌చార్జ్ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) సూచన మేరకు బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ నేతృత్వంలోని బృందం బడ్జెట్ రూపకల్పనలో నిమగ్నమైంది. శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌కు మెరుగులు దిద్దుతున్నారు. బీబీఎంపీ పరిధిలో మరో 11 కొత్త ఫ్లైఓవర్‌ల నిర్మాణం, నగరపరిధిలోని బీ ఖాతాలను ఏ ఖాతాలుగా మార్చే పథకం కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈసారి బీబీఎంపీ బడ్జెట్ గాత్రం రూ.9వేల కోట్లు దాటే అవకాశం ఉందని, అన్ని వర్గాల సంక్షేమానికి నగరంలోని మొత్తం 243 వార్డుల అభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది.