Bars and restaurants: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 34 బార్లు..

ABN , First Publish Date - 2023-06-02T10:59:55+05:30 IST

అనుమతి లేకుండా బార్లు పనిచేస్తున్నట్లు ఫిర్యాదులందాయి. దీంతో, వేలూరు మండల టాస్మాక్‌ మేనేజర్‌ పూం

Bars and restaurants: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 34 బార్లు..

వేలూరు(చెన్నై): వేలూరు, రాణిపేట, తిరుపత్తూర్‌, తిరువణ్ణామలై జిల్లాల్లో అనుమతి లేకుండా బార్లు పనిచేస్తున్నట్లు ఫిర్యాదులందాయి. దీంతో, వేలూరు మండల టాస్మాక్‌ మేనేజర్‌ పూంగొడి, డీఎస్పీలు తిరునావుక్కరసు, పళని నేతృత్వంలో రెవెన్యూ అధికారులు(Revenue Officers) నాలుగు జిల్లాల్లో తనిఖీలు చేసి అనుమతి లేకుండా నడుపుతున్న 34 బార్లను మూసివేసి సీలు వేశారు. ఈ తనిఖీల్లో తిరువణ్ణామలై జిల్లా టాస్మాక్‌ మేనేజర్‌ పుష్పలత, వాణియంబాడి ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ భానుమతి తదితరులున్నారు.

Updated Date - 2023-06-02T10:59:55+05:30 IST