Share News

Lufthansa flight: భార్యాభర్తల కీచులాటతో ఢిల్లీకి విమానం మళ్లింపు

ABN , First Publish Date - 2023-11-29T16:03:18+05:30 IST

ప్రయాణికుల అనుచిత ప్రవర్తన కారణంగా మునిచ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న లుఫ్తాన్సా విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు. ఈ ఘటన బుధవారంనాడు చోటుచేసుకుంది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తల మధ్య కీచులాట చోటుచేసుకుంది. దీంతో దారి మళ్లింపు నిర్ణయం తీసుకున్నారు.

Lufthansa flight: భార్యాభర్తల కీచులాటతో ఢిల్లీకి విమానం మళ్లింపు

న్యూఢిల్లీ: ప్రయాణికుల అనుచిత ప్రవర్తన కారణంగా మునిచ్ నుంచి బ్యాంకాక్ (Munich-Bangkok) వెళ్తున్న లుఫ్తాన్సా (Lufthansa) విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు. ఈ ఘటన బుధవారంనాడు చోటుచేసుకుంది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తల మధ్య కీచులాట చోటుచేసుకుంది. దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇది విమాన సిబ్బంది దృష్టికి రావడంతో వెంటనే విమానం దారి మళ్లింపు నిర్ణయం తీసుకున్నారు.


భార్యాభర్తల మధ్య కీచులాటకు కారణం తెలియదని, వీరి మధ్య గొడవ కారణంగా విమానాన్ని దారి మళ్లించాలనే నిర్ణయం తీసుకున్నారని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఏవియేషన్ సెక్యూరిటీ తెలిపింది. తొలుత విమానాన్ని దగ్గరలోని పాకిస్థాన్ విమానాశ్రయానికి తరలించాలని అనుకున్నప్పటికీ గుర్తుతెలియని కారణాల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు. అనంతరం విమానాన్ని సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలో అనుచిత ప్రవర్తనకు పాల్పడిన భార్యాభర్తలిద్దరిని ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీకి అప్పగించారు. దీనిపై లుఫ్తాన్సా నుంచి ఇంకా స్పందించాల్సి ఉంది.

Updated Date - 2023-11-29T16:18:44+05:30 IST