Bangalore: రేపే ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం
ABN , First Publish Date - 2023-10-27T12:57:00+05:30 IST
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అక్టోబరు 28న ఏర్పడనుంది. ఖగోళ శాస్త్రవేత్త ఒకరు నగరంలో గురువారం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అక్టోబరు 28న ఏర్పడనుంది. ఖగోళ శాస్త్రవేత్త ఒకరు నగరంలో గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ చంద్రగ్రహణం ప్రభావం అక్టోబరు 29న కూడా ఉంటుందన్నారు. ఈ చంద్రగ్రహణం భారతదేశంలోనూ కనిపిస్తుందన్నారు. అక్టోబరు 28న రాత్రి 11-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ చంద్రగ్రహణం అక్టోబరు 29 ఉదయం 2-30 వరకు కొనసాగుతుందన్నారు. మొత్తానికి గ్రహణం అవధి అక్టోబరు 29న తెల్లవారు జామున 1.04 గంటల నుంచి 2.22 గంటల మధ్య ప్రధానంగా ఉం టుందన్నారు. కాగా శరద్‌పూర్ణిమలో గజకేసరి యోగంలో ఈ చం ద్రగ్రహణం ఉంటుందని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. ప్రతి 30 సంవత్సరాలకోసారి ఇలా సంభవిస్తుంటుందన్నారు. ఈ గ్రహణం ప్రభావం ఒకింత ప్రతికూలంగా ఉంటుందని కూడా సెలవిస్తున్నారు.
