Bangalore: ఇక ఆలస్యం లేదు..: రేపటి నుంచే శాసనసభ సమావేశాలు

ABN , First Publish Date - 2023-05-21T12:34:57+05:30 IST

రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈనెల 22 నుంచి కొనసాగనున్నాయి. శాసనసభ ఎన్నికలు ఈనెల 10న ముగిశాయి. 13న కౌంటింగ్‌ జరగ

Bangalore: ఇక ఆలస్యం లేదు..: రేపటి నుంచే శాసనసభ సమావేశాలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈనెల 22 నుంచి కొనసాగనున్నాయి. శాసనసభ ఎన్నికలు ఈనెల 10న ముగిశాయి. 13న కౌంటింగ్‌ జరగగా కాంగ్రెస్‌కు 135 స్థానాలు దక్కాయి. స్పష్టమైన మెజారిటీ వచ్చిన మేరకు కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం ఏర్పాటైంది. శనివారం సీఎం సిద్ద రామయ్య(CM Sidda Ramaiah), డీసీఎంగా డీకే శివకుమార్‌(DK Sivakumar) సహా 8మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరింది. ప్రభుత్వం కొనసాగేందుకు కేబినెట్‌ ఏర్పాటు జరిగింది. కానీ గెలుపొందిన శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. ఈనెల 24లోగా కొత్త శాసనసభ ఏర్పాటు కావాల్సి ఉన్నందున ఈలోగానే ప్రక్రియ ముగించదలిచారు. ఇందులో భాగంగానే సోమవారం నుంచి శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రోటెం స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే ఆర్‌వీ దేశ్‌పాండేను నియమించారు. ఇదే సమావేశాలలోనే శాశ్వత పద్ధతిన స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.

Updated Date - 2023-05-21T12:34:57+05:30 IST