Ballari: ‘గాలి’కి కాంగ్రెస్ నేతల వార్నింగ్.. నీ కుట్రలు, దౌర్జన్యాలు ఇక సాగనీయం..

ABN , First Publish Date - 2023-09-02T11:43:28+05:30 IST

నమ్మిన వారిని మోసం చేశావు.. ఆంధ్ర, కర్ణాటకలో సరిహద్దు రాళ్లను, సుంకులమ్మ గుడిని కూల్చేసిన దుర్మార్గుడివి

Ballari: ‘గాలి’కి కాంగ్రెస్ నేతల వార్నింగ్.. నీ కుట్రలు, దౌర్జన్యాలు ఇక సాగనీయం..

- సరిహద్దు రాళ్లను, సుంకులమ్మ గుడిని కూలగొట్టావు

- ఎమ్మెల్యే భరత్‌ రెడ్డి, మంత్రి నాగేంద్రలను విమర్శించేందుకే డ్రామాలు

- గాలి జనార్దన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ నేతల ధ్వజం

బళ్లారి, (ఆంధ్రజ్యోతి): నమ్మిన వారిని మోసం చేశావు.. ఆంధ్ర, కర్ణాటకలో సరిహద్దు రాళ్లను, సుంకులమ్మ గుడిని కూల్చేసిన దుర్మార్గుడివి అంటూ గాలి జనార్దన్‌ రెడ్డి(Gali Janardhan Reddy)పై వీరశైవ లింగాయత మహాసభ అధ్యక్షుడు చానల్‌ శేఖర్‌(Channel Shekhar), కాంగ్రెస్‌ నాయకులు దేవిరెడ్డి సతీష్‏రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ బీ- బ్లాక్‌ అధ్యక్షుడు అభిలాష్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు ముల్లంగి నందీష్‌, జి. జగన్‌, కమీలా సూరీ, కార్పొరేటర్‌ విక్కీ, వన్నప్ప, మించు శ్రీనివాసులు, కుభేరా, విష్ణు, బెణకల్లు బసవ, బత్రి వాసు, కాంగ్రెస్‌ పార్టీ బి- బ్లాక్‌ అధ్యక్షుడు పీరా, లాల్‌ మోహన్‌, ఇతర కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. గురువారం ఎం. అలీఖాన్‌, దమ్మూరు శేఖర్‌, ఇతర కేఆర్‌పీపీ కార్యకర్తలతో బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పై అసత్య ఆరోపణలు. అసభ్య పదజాలాలతో దూషించడాన్ని వీరు ఖండించారు. గాలి జనార్దన్‌ రెడ్డి గంగావతిపై దృష్టి పెట్టాలని, ఆయనకు బళ్లారిలో పనేముందన్నారు. నారా సూర్యనారాయణ రెడ్డి(Nara Suryanarayana Reddy) ఇప్పటికే సుమారు 200 దేవాలయాలు కట్టేందుకు సాయమ చేస్తే, గాలి కూల్చే పనిలో నిమగ్నమయ్యారన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి గంగావతి ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేసినపుడు అన్నీ తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారని అందుకే టపాల శ్యాం కూడా ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. గనుల తరలిపునకే రింగ్‌ రోడ్డు వేశారని ప్రజల కోసం కాదన్నారు. నగర పాలికెలో అప్పడు పనిచేస్తున్న అధికారి మురళీ, మరో ఇద్దరు మరణం వెనుక ఎవరి రక్త చరిత్ర ఉందో ఇక్కడ ప్రజలకు బాగా తెలుసని, నారా భరత్‌ రెడ్డికి టికెట్‌ రాకుండా తెరవెనకు జోరుగా ప్రయత్నించారన్నారు. కాంగ్రెస్‌ నాయకులపై అనవసర ఆరోపణలు చేస్తే సహించమన్నారు.

pandu4.jpg

Updated Date - 2023-09-02T11:43:29+05:30 IST