Chennai airport: కొండచిలువలు, విదేశీ పాములు స్వాధీనం
ABN , First Publish Date - 2023-01-17T07:32:02+05:30 IST
బ్యాంకాక్ నుంచి విమానంలో గుట్టుగా తీసుకువచ్చిన అరుదైన విదేశీ కొండచిలువలు, పాములు, తాబేళ్లను...
చెన్నై(తమిళనాడు): బ్యాంకాక్ నుంచి విమానంలో గుట్టుగా తీసుకువచ్చిన అరుదైన విదేశీ కొండచిలువలు, పాములు, తాబేళ్లను చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.(ball pythons, snakes) రెండు సంచుల్లో 45 బాల్ కొండచిలువలు, 8 విదేశీ పాములు, త్రీస్టార్ తాబేళ్లను అధికారులు సీజ్ చేశారు.(Exotic species seized) చెన్నై విమానాశ్రయంలో (Chennai airport)పాములున్న బ్యాగులను బ్యాగేజ్ క్లెయిమ్ వద్ద ఎవరూ తీసుకోలేదు. కొండచిలువలు, పాములు కోలుకున్న తర్వాత వీటిని తిరిగి బ్యాంకాక్ నగరానికి పంపిస్తామని చెన్నై కస్టమ్స్ అధికారులు చెప్పారు.