ATM card: ప్రత్యేక ఏటీఎం కార్డులు వచ్చేస్తున్నాయ్.. దేనికోసమంటే...
ABN , First Publish Date - 2023-09-10T07:48:26+05:30 IST
రాష్ట్రంలో గృహిణులకు నెలకు రూ.1,000 పంపిణి చేసే పథకం కింద ప్రత్యేక ఏటీఎం కార్డు సిద్ధమవుతోంది. ఈ నెల 15వ
ప్యారీస్(చెన్నై): రాష్ట్రంలో గృహిణులకు నెలకు రూ.1,000 పంపిణి చేసే పథకం కింద ప్రత్యేక ఏటీఎం కార్డు సిద్ధమవుతోంది. ఈ నెల 15వ తేది మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతిని పురస్కరించుకొని రాష్ట్రప్రభుత్వం గృహాల వారీగా ఎంపిక చేసిన మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థికసాయం అందించే పథకాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1.63 కోట్ల మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. అర్హత పొందిన గృహిణులకు ప్రతినెలా వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు చెల్లిస్తారు. బ్యాంక్ ఖాతా(Bank account) లేని వారు జాతీయ, సహకార బ్యాంకులను సంప్రదించి ఖాతా ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఈ పథకం కోసం ఎంపిక చేసిన మహిళల కోసం ప్రత్యేకంగా ఏటీఎం కార్డు తయారవుతోంది. సీఎం స్టాలిన్(CM Stalin) పథకాన్ని ప్రారంభించిన వెంటనే ఈ కార్డ్ ద్వారా గృహిణులు నగదు డ్రా చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.