Sachin Pilot: గెహ్లాట్ లీడర్ సోనియా కాదు, వసుంధరా రాజే..

ABN , First Publish Date - 2023-05-09T14:18:50+05:30 IST

జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదంటూ కస్సుమంటున్న కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్ ఈసారి మరింత దూకుడు పెంచారు. ధోలాపూర్‌లో గెహ్లాట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పైలట్ మంగళవారంనాడు మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. సీఎం చేసిన ప్రసంగం చూస్తే ఆయన లీడర్ సోనియాగాంధీ కాకుండా వసుంధరా రాజే అనే విషయం స్పష్టమవుతోందని అన్నారు.

Sachin Pilot: గెహ్లాట్ లీడర్ సోనియా కాదు, వసుంధరా రాజే..

జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదంటూ కస్సుమంటున్న కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) ఈసారి మరింత దూకుడు పెంచారు. ధోలాపూర్‌లో గెహ్లాట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పైలట్ మంగళవారంనాడు మీడియా సమావేశంలో ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం చేసిన ప్రసంగం చూస్తే ఆయన లీడర్ సోనియాగాంధీ కాకుండా వసుంధరా రాజే అనే విషయం స్పష్టమవుతోందని అన్నారు.

గెహ్లాట్ తన ప్రసంగంలో, రాజస్థాన్‌లో 2020లో నాయకత్వం మార్పు కోరుతూ పైలట్, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సమయంలో తన ప్రభుత్వాన్ని కాపాడేందుకు సాయం చేసిన బీజేపీ నేతల్లో వసుంధరా రాజే ఒకరని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పైలట్ మీడియా సమావేశంలో మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి ఆరోపణలపై గెహ్లాట్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తనకు ఇప్పుడు అర్ధమైందని అన్నారు. సీఎం ప్రసంగం చూసినప్పుడు సోనియాగాంధీ ఆయన లీడర్ కాదని, వసుంధరారాజే అని చెప్పినట్టు కనిపిస్తోందన్నారు. ''సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఒకవ్యక్తి విమర్శించడాన్ని మొదటిసారిగా నేను చూస్తున్నారు. బీజేపీ నేతలను ప్రశంచించి, సొంత పార్టీ నేతలను కించపరచేలా మాట్లాడటం పూర్తిగా తప్పు'' అని గెహ్లాట్‌పై పైలట్ మండిపడ్డారు. అవినీతిపై గెహ్లాట్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో కూడా ఇప్పుడు తనకు అర్ధమయిందని చెప్పారు.

'జన్ సంఘర్ష్ యాత్ర'కు రెడీ...

కాగా, మే 11వ తేదీ నుంచి ఐదురోజుల పాటు 'జన్ సంఘర్షణ్ యాత్ర'ను తాను నిర్వహించనున్నట్టు పైలట్ ప్రకటించారు. అజ్మీర్ నుంచి జైపూర్ వరకూ ఐదురోజుల పాటు ఈ యాత్ర నిర్వహిస్తామని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జరుపుతున్న యాత్ర ఇదని, యాత్ర పూర్తయిన తర్వాతే ఏ నిర్ణయమైనా ఉంటుందని చెప్పారు. వసుంధరా రాజే హయాంలో చోటుచేసుకున్న అవినీతిపై గెహ్లాట్ చర్యలు తీసుకోవాలంటూ గత నెలలో పైలట్ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షపై అధిష్ఠానం హెచ్చరించినప్పటికీ ఆయన తన నిరసన కొనసాగించారు.

Updated Date - 2023-05-09T14:18:50+05:30 IST