Diwali-2023: దీపావళి మరుసటి రోజు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-11-07T11:20:31+05:30 IST
దీపావళి(Diwali) పండుగ మరుసటిరోజు సెలవు దినంగా ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం, ప్రత్నామ్యాయంగా 18వ తేది పనిదినంగా
- బదులుగా 18న పనిదినం
పెరంబూర్(చెన్నై): దీపావళి(Diwali) పండుగ మరుసటిరోజు సెలవు దినంగా ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం, ప్రత్నామ్యాయంగా 18వ తేది పనిదినంగా పేర్కొంది. ఈ నెల 12వ తేది ప్రజలు దీపావళి జరుపుకోనున్నారు. ఈ ఏడాది దీపావళి ఆదివారం రావడం, దానికి ముందు రోజు శనివారం కావడంతో వారాంతపు సెలవు ఉంటుందని విద్యార్థులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు భావిస్తున్నారు. చెన్నై(Chennai) సహా పలు నగరాల్లో విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం వచ్చిన ప్రజలు దీపావళిని స్వగ్రామాల్లో చేసుకొనేందుకు కుటుంబాలతో వెళ్తుంటారు. పండుగ ముగిసిన మరుసటిరోజు సోమవారం పనిదినం కావడంతో స్వగ్రామాలకు వెళ్లిన వారు హడావుడిగా బయల్దేరాల్సి ఉంటుంది. అందువల్ల సోమవారం సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పరిశీలించిన ప్రభుత్వం, దీపావళి మరుసటిరోజైన సోమవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.