Amma canteens: ఎంతపెద్ద మోసమో చూడండి.. అదేంటో తెలిస్తే మీరు కూడా..
ABN , First Publish Date - 2023-03-19T11:52:03+05:30 IST
నగరంలోని అమ్మా క్యాంటీన్ల(Amma canteens)లో తయారవుతున్న ఇడ్లీలు, చపాతీలు రోడ్‌సైడ్ తోపుడు బండ్లపై నడుపుతున్న టిఫిన్ దుకాణాలకు సరఫ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): నగరంలోని అమ్మా క్యాంటీన్ల(Amma canteens)లో తయారవుతున్న ఇడ్లీలు, చపాతీలు రోడ్‌సైడ్ తోపుడు బండ్లపై నడుపుతున్న టిఫిన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. చెన్నైలోని సుమారు 50 అమ్మా క్యాంటీన్లలో రోజువారీ కలెక్షన్లు రూ.100కంటే తక్కువగా ఉండటం పట్ల అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అమ్మా క్యాంటీన్లల మూడు పూటల ఇడ్లీలు, పొంగల్, సాంబార్, కరివేపాకు, పెరుగన్నాలు, చపాతీలు తయారు చేసి విక్రయించేందుకు కార్పొరేషన్ యేడాదికి 140 కోట్లను ఖర్చుపెడుతోంది. అమ్మా క్యాంటీన్ల ద్వారా కార్పొరేషన్(Corporation)కు యేడాదికి రూ.20 కోట్ల ఆదాయం కూడా రావటం లేదు. నష్టాల్లో నడుపుతున్న ఈ క్యాంటీన్లలో ప్రస్తుతం సిబ్బంది తయారు చేస్తున్న ఇడ్లీ, పొంగర్, సాంబారు, కరివేపాకు, పెరుగన్నాలను రాత్రిపూట కార్పొరేషన్ సరఫరా చేస్తున్న చపాతీలను బయటి వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు తక్కువ అమ్మకాలు జరుగుతున్న అమ్మా క్యాంటీన్లలో ఆకస్మిక తనిఖీలు జరిపి చేతివాటం ప్రదర్శిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.