Airport: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో భద్రతాలోపం

ABN , First Publish Date - 2023-03-19T13:45:50+05:30 IST

బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(Airport)లో తరచూ తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం 30మంది శ్రీలం

Airport: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో భద్రతాలోపం

- డొమెస్టిక్‌ ఎగ్జిట్‌లో శ్రీలంక ప్రయాణీకులు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(Airport)లో తరచూ తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం 30మంది శ్రీలంక ప్రయాణీకులు డొమెస్టిక్‌ ఎగ్జిట్‌లో బయటకు వచ్చారు. ఎయిర్‌ పోర్ట్‌లో నేషనల్‌, ఇంటర్నేషనల్‌ ప్రయాణీకులకు ప్రవేశం, బయటకు వచ్చే మా ర్గాలు ప్రత్యేకంగా ఉంటాయి. శుక్రవారం శ్రీలంక రాజధాని కొలంబో నుంచి 30 మంది ప్రయాణీకులు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌(Bangalore Airport)కు చేరుకున్నారు. వారు బయటకు వచ్చే బస్సు ఇంటర్నేషనల్‌ ఎగ్జిట్‌ మార్గంగా కాకుండా డొమెస్టిక్‌ మార్గంలో వచ్చిం ది. 173మంది ప్రయాణీకులలో ఓ బస్సులో ప్రయాణించిన 30మందిని డొమెస్టిక్‌ మార్గంగా బయటకు వచ్చారు. వారికి సంబంధించిన లేగేజీలు పొందే విషయంలో గందరగోళం ఏర్పడింది. టర్మినల్‌లో పర్యవేక్షించి సీఐఎస్‌ఎఫ్‌, ఇమ్మిగ్రేషన్‌ అధి కారులు కాసేపట్లోనే గమనించారు. వెంటనే వారిని మరోసారి ఇంటర్నేషనల్‌ ఎగ్జిట్‌ వైపు తరలించారు. అదే ప్రదేశంలోనే వారి లగేజీని పొందేలా చర్యలు తీసు కున్నారు. భారీ తప్పిదంపై ఎయిర్‌పోర్ట్‌ అధికారులు స్పందించారు. మానవ తప్పి దంతో గందరగోళానికి కారణమైందన్నారు. అయితే ప్రయాణీకులందరినీ మరోసారి ఇంటర్నేషనల్‌ ఎగ్జిట్‌ మార్గంగానే పరిశీలించి పంపామని ఎటువంటి సమస్యా లేదని వివరణ ఇచ్చారు. కాగా ఈ ఏడాది ఆరంభంలో బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే గోఫస్ట్‌ విమానం 50 మంది ప్రయాణీకులను ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలేసి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారికోసం ప్రత్యేక విమానాన్ని సమకూర్చిన అంశం జాతీయస్థాయిలో చర్చకు కారణమైంది.

Updated Date - 2023-03-19T13:45:50+05:30 IST