Delhi: ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడి అత్యుత్సాహం.. దుర్భాషలాడుతూ రభస.. కేసు నమోదు

ABN , First Publish Date - 2023-10-05T21:45:42+05:30 IST

ఎయిర్ ఇండియా(Air Inida) విమానంలో ఓ వ్యక్తి అత్యుత్సాహంతో ప్రయాణికులు(Passengers) అవస్థలు ఎదుర్కొన్నారు. ఆ వ్యక్తి తోటి ప్రయాణికులపై దుర్భాషలాడుతూ.. ప్రశ్నించిన విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.

Delhi: ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడి అత్యుత్సాహం.. దుర్భాషలాడుతూ రభస.. కేసు నమోదు

ఢిల్లీ: ఎయిర్ ఇండియా(Air Inida) విమానంలో ఓ వ్యక్తి అత్యుత్సాహంతో ప్రయాణికులు(Passengers) అవస్థలు ఎదుర్కొన్నారు. ఆ వ్యక్తి తోటి ప్రయాణికులపై దుర్భాషలాడుతూ.. ప్రశ్నించిన విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో పంజాబ్(Punjab) లోని జలంధర్ కి చెందిన అభినవ్ శర్మ అనే ప్రయాణికుడు తోటి వారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు.


క్యాబిన్ సూపర్ వైజర్ అతన్ని హెచ్చరించగా.. ఆమెను పరుష పదజాలంత తిడుతూ హెచ్చరించాడు. ఆమె ఫిర్యాదు మేరుకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విమానాల్లో తరూచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-10-05T21:46:19+05:30 IST