Actress Vijayalakshmi: సీమాన్‌పై రూ.20 కోట్లకు పరువునష్టం దావా
ABN , First Publish Date - 2023-09-22T10:52:17+05:30 IST
నామ్ తమిళర్ కట్చి కన్వీనర్, సినీ దర్శకుడు సీమాన్(Seeman is the film director)పై రూ.20 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని
- నటి విజయలక్ష్మి హెచ్చరిక
అడయార్(చెన్నై): నామ్ తమిళర్ కట్చి కన్వీనర్, సినీ దర్శకుడు సీమాన్(Seeman is the film director)పై రూ.20 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని సినీ నటి విజయలక్ష్మి(Film actress Vijayalakshmi) హెచ్చరించారు. సీమాన్ తనపై ఒక కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేయనున్నట్టు బెదరిస్తున్నారని, ఆయనపైనే తాను రూ.20 కోట్లకు దావా వేస్తానని హెచ్చరించారు. పైగా తన భర్త జగేష్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందువల్ల జగేష్ ద్వారా కూడా సీమాన్‌పై పరువు నష్టం దావా వేసి బెంగళూరు కోర్టులచుట్టూ తిప్పిస్తానన్నారు. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆ వీడియోలో హెచ్చరించారు.
