Uttar Pradesh : తల్లీకూతుళ్లపై అఘాయిత్యం.. మతం మారాలని ఒత్తిళ్లు..
ABN , First Publish Date - 2023-06-11T13:12:48+05:30 IST
ఉత్తర ప్రదేశ్‌లో మతమార్పిడి ముఠా చాలా నీచ స్థాయికి దిగజారింది. స్నేహం ముసుగులో అత్యాచారాలు చేసి, వీడియోలు తీసి, మతం మారాలని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో మతమార్పిడి ముఠా చాలా నీచ స్థాయికి దిగజారింది. స్నేహం ముసుగులో అత్యాచారాలు చేసి, వీడియోలు తీసి, మతం మారాలని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వీరు మైనర్ బాలికల పట్ల కూడా కనికరం చూపడం లేదు. వీరి బారిన పడిన ఓ వితంతువు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. బరేలీ జిల్లా, బారాదరి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
బాధితురాలు చేసిన ఫిర్యాదులోని వివరాలను నగర పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ భాటి వెల్లడించారు. బరేలీ జిల్లా బారాదరి ప్రాంతానికి చెందిన బాధితురాలు గతంలోనే భర్తను కోల్పోయారు. ఆమెకు పన్నెండేళ్ల వయసుగల కుమార్తె ఉంది. బాధితురాలికి మూడు నెలల క్రితం నకాతియాలో నివసిస్తున్న ఇరామ్ సైఫీ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేవారు. సైఫీ తన మతస్థులను బాధితురాలి ఇంటికి తీసుకెళ్తూ ఉండేది. వారితో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని బాధితురాలిపై ఇరామ్ సైఫీ నిర్బంధించింది. దీనికి సంబంధించిన అశ్లీల వీడియోలను చిత్రీకరించింది. ఆ వీడియోలను చూపించి బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేస్తోంది.
ఇరామ్ సైఫీ సోదరుడు బబ్లూ సైఫీ కూడా బాధితురాలి ఇంటికి వెళ్లేవాడు. బబ్లూ బాధితురాలి కుమార్తెను లైంగికంగా వేధించాడు. అంతేకాకుండా ఆ బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.
సైఫీ గురువారం బాధితురాలిని, ఆమె కుమార్తెను తన ఇంటికి పిలిచింది. మౌల్వీ సమక్షంలో మతం మారాలని వీరిపై ఇరామ్ సైఫీ తండ్రి ఒత్తిడి తెచ్చాడు. మతం మారడానికి బాధితురాలు నిరాకరించడంతో నిందితులు ఆమెను, ఆమె కుమార్తెను కొట్టారు.
నిందితులు ఇరామ్ సైఫీ, బబ్లూ సైఫీ, మౌల్వీ, మరొకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత శిక్షా స్మృతి, ఉత్తర ప్రదేశ్ చట్ట విరుద్ధ మత మార్పిడి నిరోధక చట్టం ప్రకారం ఆరోపణలు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Wrestlers : ఆధారాలివ్వండి : ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరిన ఢిల్లీ పోలీసులు
Congress : కాంగ్రెస్‌కు అంతు చిక్కని సచిన్ పైలట్ వ్యవహారం