America Rice: అమెరికాలో ఒక కుటుంబానికి ఒక రైస్‌ బ్యాగే

ABN , First Publish Date - 2023-07-27T01:27:13+05:30 IST

బియ్యం(Rice) ఎగుమతులపై భారత్‌(India) ఆంక్షలు విధించడంతో అమెరికా(America)లోని ప్రవాస భారతీయులు(ఎన్నారై) సహా ఆసియా దేశాలకు చెందిన పౌరులు తిండిగింజల కోసం తిప్పలు పడుతున్నారు.

America  Rice: అమెరికాలో ఒక కుటుంబానికి   ఒక రైస్‌ బ్యాగే

స్థానిక వ్యాపారుల నిబంధనలు

ఎగుమతులపై భారత్‌ ఆంక్షల ఫలితం

న్యూఢిల్లీ, జూలై 26: బియ్యం(Rice) ఎగుమతులపై భారత్‌(India) ఆంక్షలు విధించడంతో అమెరికా(America)లోని ప్రవాస భారతీయులు(ఎన్నారై) సహా ఆసియా దేశాలకు చెందిన పౌరులు తిండిగింజల కోసం తిప్పలు పడుతున్నారు. ఏక్షణంలో అయినా అమెరికాలో ప్రస్తుతం ఉన్న బియ్యం నిల్వలు నిండుకుంటాయన్న ప్రచారంతో మరింత ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రిటైల్‌ వ్యాపారులు అమ్మకాలపై నియంత్రణ విధించారు. ‘ఒక కుటుంబానికి ఒక రైస్‌ బ్యాగ్‌’ నిబంధనను అమలు చేస్తున్నారు. ఈ మేరకు దుకాణాల ముందు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో కనీసం ఒక్క బ్యాగునైనా దక్కించుకుందామన్న ఉద్దేశంతో ఎన్నారైలు సహా ఆసియా దేశాల ప్రజలు ఆయా దుకాణాల ముందు భారీ ఎత్తున క్యూకట్టారు. భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిన మరుక్షణమే ఎన్నారైలు ఏడాదికి సరిపడా బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలని భావించారు. కానీ, వ్యాపారులు ఒక కుటుంబానికి ఒక రైస్‌ బ్యాగ్‌ నిబంధనను కఠినంగా అమలు చేస్తుండడంతో వీరిలో ఆందోళన వ్యక్తమవుతోం ది. ఇదిలావుంటే.. వినియోగదారుల తాకిడితో దుకాణాల్లోనూ బియ్యం స్టాకు నిండుకుంటోందని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - 2023-07-27T01:27:13+05:30 IST