90 ml of alcohol: త్వరలో.. 90 ఎంఎల్ మద్యం టెట్రా ప్యాక్
ABN , First Publish Date - 2023-11-11T10:50:45+05:30 IST
టాస్మాక్ సంస్థ ద్వారా 90 ఎంఎల్ మద్యం టెట్రా ప్యాక్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు మంత్రి
మంత్రి ఎస్.ముత్తుస్వామి
ప్యారీస్(చెన్నై): టాస్మాక్ సంస్థ ద్వారా 90 ఎంఎల్ మద్యం టెట్రా ప్యాక్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు మంత్రి ఎస్.ముత్తుస్వామి(Minister S. Muthuswamy) ప్రకటించారు. కోయంబత్తూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దీపావళి పండుగ సందర్భంగా మద్యం విక్రయాలను పెంచాలని టాస్మాక్‌కు ప్రభుత్వం తరఫున ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. మద్యపానీయాల విక్రయాలను తగ్గించే విధంగా టాస్మాక్ చిల్లర దుకాణాల్లో నిబంధనలు విధించినట్లు తెలిపారు. ఎమ్మార్పీ కంటే అధికంగా మద్యం విక్రయించే సూపర్‌వైజర్, సేల్స్‌మెన్‌పై ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీపావళి కానుకగా 5,329 చిల్లర టాస్మాక్ దుకాణాల్లో పని చేస్తున్న 28,824 మంది ఉద్యోగులకు 20 శాతం బోనస్ అందజేసినట్లు మంత్రి తెలిపారు.
