Share News

World's Largest Meditation Centre: ఏడు అంతస్తులు, 101 ఫౌంటెన్‌లు.. ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం..

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:45 PM

ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రమైన స్వర్‌వేద్ మహా మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్న మోదీ తన నియోజకరవర్గమైన వారణాసిలో నిర్మితమైన ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు.

World's Largest Meditation Centre: ఏడు అంతస్తులు, 101 ఫౌంటెన్‌లు.. ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం..

ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రమైన ``స్వర్‌వేద్ మహా మందిరాన్ని`` (Swarved Mahamandir) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారం ప్రారంభించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్న మోదీ తన నియోజకరవర్గమైన వారణాసిలో నిర్మితమైన ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో కలిసి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. వారణాసికి (Varanasi) 12 కిలీమీటర్ల దూరంలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మహా మందిరాన్ని నిర్మించారు (World's Largest Meditation Centre).

ఈ మహామందిరింలో 125 తామర పూవు రేకుల గోపురాలు ఉన్నాయి. ఈ మందిరంలో మొత్తం 20 వేల మంది కూర్చోవచ్చు. ఆ ఆలయవంలో వేసిన మకరానా పాలరాతిపై మొత్తం 3,137 స్వర్వ్ శ్లోకాలను చెక్కారు. ఈ మందిర ప్రాంగణంలో ఔషధ మూలికలతో కూడిన అద్భుతమైన తోట కూడా ఉంది. ఈ మందిరంలో మొత్తం 101 ఫౌంటెన్‌లను ఏర్పాటు చేశారు. 2004లో ప్రారంభమైన ఈ మందిరం నిర్మాణంలో 15 మంది ఇంజనీర్లు, 600 మంది కార్మికులు పాల్గొన్నారు. ``స్వర్‌వేద్ మహా మందిరం భారతదేశం సామాజిక, ఆధ్యాత్మిక బలానికి ఆధునిక చిహ్నం" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 03:45 PM