IIM Student Heart Attack: విషాదం.. గుండెపోటుతో 27 ఏళ్ల ఐఐఎమ్ స్టూడెంట్ మృతి

ABN , First Publish Date - 2023-07-26T16:36:57+05:30 IST

కరోనా తర్వాత గుండెపోటు మరణాల సంఖ్య ఎక్కువైపోయింది. వయసుతో సంబంధం లేకుండా.. టీనేజర్లు సైతం హార్ట్ ఎటాక్‌తో..

IIM Student Heart Attack: విషాదం.. గుండెపోటుతో 27 ఏళ్ల ఐఐఎమ్ స్టూడెంట్ మృతి

కరోనా తర్వాత గుండెపోటు మరణాల సంఖ్య ఎక్కువైపోయింది. వయసుతో సంబంధం లేకుండా.. టీనేజర్లు సైతం హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. ఇప్పుడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్) బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల ఆయుష్ గుప్తా అనే విద్యార్థి మృతిచెందాడు. ఈ విషయాన్ని ఐఐఎమ్ బెంగళూరు తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. కార్డియాక్ అరెస్ట్‌తో ఆయుష్ గుప్తా జులై 23వ తేదీన మధ్యాహ్నం మృతి చెందాడని, ఇతని మృతితో తాము తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యామని ట్వీట్ చేసింది.

కాగా.. ఆయుష్ గుప్తా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో మేనేజ్‌మెంట్ కోర్సులో రెండో సంవత్సరంలో చదువుతున్నాడు. ఇతను వేసవి సెలవుల్లో ఫేరింగ్ కాపిటల్‌లో ఇంటర్న్‌షిప్ కూడా చేశాడు. 2017లో బిట్స్ పిలానీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయుష్.. పీజీపీ యొక్క స్టూడెంట్ అలుమ్ని కమిటీలో సీనియర్ కో-ఆర్డినేటర్‌గా కూడా సేవలందించాడు. ఇతని మృతికి ఐఐఎంబీ సంతాపం తెలుపుతూ.. జులై 24వ తేదీన సెలవు ప్రకటించింది. ఆయుష్ మరణం బాధించిందని, అతడు బిజినెస్ వరల్డ్‌లో తనదైన ముద్ర వేసి ఉండేవాడని, అతని కలిసి గడిపిన ఆ క్షణాలు మరువలేనంటూ.. అతని సహచరుడు సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు.

Updated Date - 2023-07-26T16:38:01+05:30 IST