Ram Navami: పండుగ వేళ బావిలో పడి భక్తులు మృతి... మోదీ సంతాపం

ABN , First Publish Date - 2023-03-30T15:25:52+05:30 IST

ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Ram Navami: పండుగ వేళ బావిలో పడి భక్తులు మృతి... మోదీ సంతాపం
PM Narendra Modi

ఇండోర్: శ్రీరామనవమి(Ram Navami) వేళ మధ్యప్రదేశ్(Madhyapradesh) ఇండోర్ (Indore) స్నేహ్ నగర్ పటేల్ నగర్ శ్రీ బోలేశ్వర్ మహాదేవ్ ఝూలేలాల్ మందిరంలో(Beleshwar Mahadev Jhulelal Temple) ఘోర ప్రమాదం జరిగింది. దేవాలయంలోని మెట్ల బావి వద్ద భక్తులు పూజలు చేస్తుండగా పైకప్పు కూలిపోయింది. దీంతో భక్తులు బావిలో పడిపోయారు. 13 మంది చనిపోయారు. మరణించిన వారిలో పది మంది మహిళలున్నారు. ఇప్పటివరకూ 19 మందిని కాపాడారు. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో(MP CM SS Chouhan) ప్రధాని మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. మరోవైపు కలెక్టర్, కమిషనర్‌లతో మాట్లాడిన చౌహాన్ ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

మరోవైపు ఘటనపై పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

Updated Date - 2023-03-30T17:23:36+05:30 IST