Share News

WHO: కొవిడ్ కేసులు పెరుగుతున్నందునా ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ABN , Publish Date - Dec 18 , 2023 | 07:48 AM

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్(Covid 19) కేసులు పెరుగుతున్నందునా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరికలు జారీ చేసింది.

WHO: కొవిడ్ కేసులు పెరుగుతున్నందునా ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్(Covid 19) కేసులు పెరుగుతున్నందునా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరికలు జారీ చేసింది. ఆయా దేశాలు కొవిడ్-19 కేసులపై పటిష్టమైన నిఘా ఉంచాలని, సీక్వెన్స్ షేరింగ్ కొనసాగించాలని స్పష్టం చేసింది. JN.1, BA.2.86 అనే కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతున్నందునా ఎక్కడికక్కడ కట్టడి చర్యలు చేపట్టాలని కోరింది.

డబ్ల్యూహెచ్ఓకి చెందిన ఓ వైద్యురాలు వాన్ కెర్ఖోవ్ ఓ వీడియోను పంచుకున్నారు. కేసుల పెరుగుదల గురించి కారణాలను వివరిస్తూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె మాట్లాడారు. తాజాగా కేరళలో కొవిడ్ సబ్-వేరియంట్ JN.1 వైరస్ ను భారత్ గుర్తించింది. ఇప్పటికే ఈ వైరస్ పలువురికి సోకినట్లు అధికారులు చెబుతున్నారు. అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయింది. టెస్టుల సంఖ్యను క్రమక్రమంగా పెంచుతూ పోతోంది.

Updated Date - Dec 18 , 2023 | 07:49 AM