Pakistan: పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...30మంది దుర్మరణం

ABN , First Publish Date - 2023-02-08T07:33:15+05:30 IST

పాకిస్థాన్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు....

Pakistan: పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...30మంది దుర్మరణం
Pakistan Road Accident

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.(Road Accident )పాక్(Pakistan) దేశంలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని(Khyber Pakhtunkhwa) కోహిస్థాన్ జిల్లాలోని కారకోరం హైవేపై రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో లోయలోకి పడిపోయాయి. ప్రావిన్స్‌లోని షిటియాల్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కారును గిల్గిట్ నుంచి రావల్పిండికి ప్రయాణీకుల బస్సు ఢీకొట్టింది.(Pakistan Accident)దీంతో బస్సు(Passenger Bus), కారు లోతైన లోయలో పడిపోయాయి. ఈ దుర్ఘటనలో 30 మంది ప్రయాణికులు మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు క్షతగాత్రులను, మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి పాకిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ సంతాపం తెలిపారు.గిల్గిత్ బాల్టిస్థాన్‌లోని చిల్లాస్ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా సంతాపం తెలిపారు.

ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం పాక్ సర్కారు ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. జనవరి 29న పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ప్రయాణీకుల కోచ్ లోయలో పడి 41 మంది మరణించారు.క్వెట్టా నుంచి కరాచీకి 48 మంది ప్రయాణికులతో బస్సు వెళుతుండగా లాస్బెలా సమీపంలోని వంతెన పిల్లర్‌ను వాహనం ఢీకొట్టింది.ఆ తర్వాత లోయలో పడి బస్సు మంటలు అంటుకున్నాయని పాక్ అధికారులు చెప్పారు.

Updated Date - 2023-02-08T07:51:53+05:30 IST