Share News

UK: కేబినెట్ మంత్రిని తొలగించిన రిషీ సునక్.. రెచ్చగొట్టే కామెంట్ల పర్యావసానం

ABN , First Publish Date - 2023-11-13T15:43:41+05:30 IST

బ్రిటన్ ప్రధాని రిషీ సునక్(Rishi Sunak) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌(Suella Braverman)ని మంత్రి పదవి నుంచి తప్పించారు.

UK: కేబినెట్ మంత్రిని తొలగించిన రిషీ సునక్.. రెచ్చగొట్టే కామెంట్ల పర్యావసానం

లండన్: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్(Rishi Sunak) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌‌ని (Suella Braverman) మంత్రివర్గం నుంచి తప్పించారు. పాలస్తీనాకు మద్ధతుగా కొన్ని రోజులక్రితం చేపట్టిన ర్యాలీలో పోలీసుల పట్ల ఆమె దురుసుగా వ్యవహారించడం, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమైంది. పోలీసుల వ్యవహార శైలిని తప్పుబడుతూ ఆమె రాసిన వ్యాసం ఓ పత్రికలో ప్రచురితమైంది. పోలీసులు ద్వంద్వ ప్రమాణాలు అవలంభిస్తున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా రిషి సునాక్ వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఆమె వ్యాఖ్యల పర్యవసానంగా బ్రిటన్ వీధుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు పెళ్లుబుకాయి.


దేశంలో ఉద్రిక్త పరిస్థితులకు సుయెల్లా బ్రేవర్‌మాన్‌ కారణమని, ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని విపక్ష లేబర్ పార్టీ ఆరోపించింది. మంత్రిని కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. దీంతో రిషి సునాక్ ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం యూకేలో ఇంటీరియర్ మినిస్టర్‌గా ఆమె వ్యవహరించారు.

ఖాళీ అయిన పదవిని మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్(David Cameron) భర్తీ చేయాలని సునాక్ నిర్ణయించారు. కాగా పాలస్తీనా(Palestine) అనుకూల ప్రదర్శనలు చేసిన ఘటనలో ఇప్పటివరకు 140 మందికిపైగా అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని సునాక్ సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ భాగంగా సుయెల్లాను తొలగించారు. ఇదిలావుండగా కేబినెట్ నుంచి మరికొంత మంది తొలగించాలని సునాక్ భావిస్తున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Updated Date - 2023-11-13T16:13:37+05:30 IST