Britain : కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ

ABN , First Publish Date - 2023-04-12T21:07:06+05:30 IST

కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరవుతారని బకింగ్‌హాం ప్యాలెస్

Britain : కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ
British Royals

లండన్ : కింగ్ చార్లెస్-3 (King Charles III) పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ (Prince Harry) హాజరవుతారని బకింగ్‌హాం ప్యాలెస్ బుధవారం ప్రకటించింది. అయితే ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ మాత్రం ఈ ఉత్సవానికి హాజరుకాబోరని తెలిపింది. ఆమె తన పిల్లలతో అమెరికాలోని కాలిఫోర్నియాలోనే ఉంటారని తెలిపింది.

కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబ్బేలో మే 6న జరుగుతుంది. 1,000 సంవత్సరాల క్రితంనాటి సంప్రదాయాల ప్రకారం ఈ ఉత్సవాలు జరుగుతాయి.

ఇదిలావుండగా, ప్రిన్స్ హ్యారీ తన సోదరుడు ప్రిన్స్ విలియంపైనా, కింగ్ చార్లెస్‌పైనా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆయన రాసిన పుస్తకంలో కూడా రాజవంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇవి కూడా చదవండి :

Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం

Varun Gandhi : యోగి ప్రభుత్వానికి వరుణ్ గాంధీ వినతి

Updated Date - 2023-04-12T23:33:55+05:30 IST