Britain : కింగ్ ఛార్లెస్ జన్మదిన వేడుకలు.. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్‌లేలకు షాక్..

ABN , First Publish Date - 2023-06-16T10:26:31+05:30 IST

బ్రిటన్ మహారాజు కింగ్ ఛార్లెస్-3 జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించే ‘ట్రూపింగ్ ది కలర్’ కార్యక్రమానికి ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్క్‌లేలకు ఆహ్వానం లేదు. ఈ దంపతులిద్దరూ ఆ రోజున తమ పిల్లలు ప్రిన్సెస్ లిలిబెట్, ప్రిన్స్ ఆర్చీలతో కాలిఫోర్నియాలోని తమ నివాసంలో గడపబోతున్నారు.

Britain : కింగ్ ఛార్లెస్ జన్మదిన వేడుకలు.. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్‌లేలకు షాక్..
Prince Harry, Meghan Markle

లండన్ : బ్రిటన్ మహారాజు కింగ్ ఛార్లెస్-3 జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించే ‘ట్రూపింగ్ ది కలర్’ కార్యక్రమానికి ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్క్‌లేలకు ఆహ్వానం లేదు. ఈ దంపతులిద్దరూ ఆ రోజున తమ పిల్లలు ప్రిన్సెస్ లిలిబెట్, ప్రిన్స్ ఆర్చీలతో కాలిఫోర్నియాలోని తమ నివాసంలో గడపబోతున్నారు.

ట్రూపింగ్ ది కలర్ (Trooping the Colour) కార్యక్రమం 16వ శతాబ్దంనాటి సంప్రదాయం. బ్రిటన్ నూతన మహారాజు కింగ్ ఛార్లెస్-3 పాలనలో ఈ కార్యక్రమాన్ని తొలిసారి ఈ ఏడాది నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం జూన్ 17న జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్క్‌లేలను ఆహ్వానించలేదని బ్రిటన్ మీడియా వెల్లడించింది. మహారాజు గుర్రంపై స్వారీ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సంప్రదాయాన్ని కింగ్ ఛార్లెస్-3 మళ్లీ ప్రవేశపెడుతున్నారు. క్వీన్ ఎలిజబెత్-2 కూడా ఈ వేడుకలను నిర్వహించేవారు.

ఈ కార్యక్రమంలో 1,400 మంది సైనికులు, 400 మంది మ్యుజీషియన్లు, 400 గుర్రాలు పాల్గొంటాయి. కింగ్ ఛార్లెస్‌కు సైనికులు గౌరవ వందనం చేస్తారు. ఈ కార్యక్రమంలో రాజ వంశీయుల్లో అత్యధికులు పాల్గొంటారు. ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ ఆన్, ప్రిన్స్ ఎడ్వర్డ్ కూడా కింగ్ ఛార్లెస్‌తోపాటు గుర్రపు స్వారీ చేస్తారు. క్వీన్ కెమిల్లా, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్, ఆమె పిల్లలు లూయిస్, జార్జి, ఛార్లోటీ ఓ వాహనంలో ప్రయాణిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

రాజ కుటుంబీకులంతా బకింగ్‌హాం ప్యాలెస్‌లోని బాల్కనీలో కూర్చుని, మిలిటరీ నిర్వహించే వైమానిక విన్యాసాలు తిలకిస్తారు. సమీపంలోని గ్రీన్ పార్క్ నుంచి 41 గన్ శాల్యూట్ ఇస్తారు. రాయల్ ఎయిర్‌ఫోర్స్ నిర్వహించే అద్భుతమైన విన్యాసాలతో ఈ వేడుకలు ముగుస్తాయి.

ఇవి కూడా చదవండి :

Reservation fight : మణిపూర్‌ మంటల వెనుక.. మీటీ, కుకీ తెగల మధ్య రిజర్వేషన్‌ పోరు

Manipur : మణిపూర్‌లో ఆగని హింసాకాండ.. కేంద్ర మంత్రి ఇంటిపై దాడి, దహనం..

Updated Date - 2023-06-16T10:30:08+05:30 IST