Nobel peace prize: ఇరాన్ మానవహక్కుల పోరాట యోధురాలికి నోబెల్ శాంతి బహుమతి

ABN , First Publish Date - 2023-10-06T16:43:16+05:30 IST

ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మది మొహమ్మదికి 2023 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఇరాన్‌లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కోసం కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న పోరాటానికి గాను ఈ అవార్డును అందజేస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.

Nobel peace prize: ఇరాన్ మానవహక్కుల పోరాట యోధురాలికి నోబెల్ శాంతి బహుమతి

ఓస్లో: ఇరాన్‌ (Iran)కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మది మొహమ్మది (Narges Mohammadi)కి 2023 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) వరించింది. ఇరాన్‌లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కోసం కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న పోరాటానికి గాను ఈ అవార్డును అందజేస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ శుక్రవారంనాడు ప్రకటించింది. నోబెల్ బహుమతి గెలిచిన 19వ మహిళ అయిన నార్గిస్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.


''హక్కుల కోసం ఆమె చేస్తున్న పోరాటంలో ఎన్నోసార్లు కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. 13 సార్లు అరెస్టయ్యారు. ఐదుసార్లు దోషిగా నిర్దారించి, మొత్తం 31 ఏళ్ల జైలు శిక్షతో పాటు కోర్టులు 154 కొరడా దెబ్బలు విధించాయి'' అని నోబెల్ కమిటీ తెలిపింది. మహిళలపై ఆంక్షలు విధించే ఇరాన్‌లో మహిళా హక్కులపై నర్గీస్ చదువుకున్న రోజుల నుంచే గళం విప్పారు. ఇంజనీరింగ్ చదివి కొంతకాలం కాలమిస్ట్‌గా పలు వార్తాపత్రికల్లో చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఇబాది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్‌లో 2003లో చేరారు. ఆ తర్వాత ఆ సంస్థ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు తొలిసారి అరెస్టయి జైలుకు వెళ్లారు. జైళ్లలో ఉంటూనే మహిళా హక్కులపై ఉద్యమం కొనసాగించారు. 2022 సెప్టెంబర్లో హిజాబ్ ధరించనందుకు మాసా అనే యువతిని అరెస్టు చేయగా ఆమె కస్టడీలో మరణించింది. దీనిపై కూడా నార్గిస్ తన గళం బలంగా వినిపించారు. కాగా, నోబెల్ శాంతి బహుమతి కింద 11 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు నగదు బహుమతిని ఓస్లోలో డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అందజేస్తారు.

Updated Date - 2023-10-06T17:55:37+05:30 IST