Pakistan: పాకిస్థాన్‌లో లీటర్ పాలు, కిలో చికెన్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..!

ABN , First Publish Date - 2023-02-14T07:59:32+05:30 IST

పాకిస్థాన్ దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి....

Pakistan: పాకిస్థాన్‌లో లీటర్ పాలు, కిలో చికెన్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..!
Milk and Chicken

లాహోర్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి.(Pakistan) ప్రస్థుతం మార్కెటులో లీటరు పాల ధర(Milk price) 210రూపాయలకు పెరిగింది. కిలో కోడిమాంసం ధర 780 రూపాయలు. గతంలో కిలో చికెన్ ధర(Chicken) 620 రూపాయలుండగా ఇది అమాంతం 780 రూపాయలకు పెరిగింది.

లూజ్ మిల్క్ ధర లీటరుకు 190 రూపాయల నుంచి 210రూపాయలకు పెంచారు.అదే ఎముకలు లేని కోడి మాంసం ధర కిలోకు రూ.1,000-1,100కి చేరింది. చికెన్ ధరలు అనూహ్యంగా పెరిగాయని సింధ్ పౌల్ట్రీ హోల్‌సేలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ(Sindh Poultry Wholesalers Association) కమల్ అక్తర్ సిద్ధిఖీ చెప్పారు.

ఇది కూడా చదవండి : Ebola Like Virus: ఈక్వటోరియల్ గినియాలో ఎబోలా కొత్త వైరస్...9 మంది మృతి

గత ఏడాది పాకిస్థాన్ దేశంలో సంభవించిన వరదలతో 2 మిలియన్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద విపత్తు నుంచి పాక్ దేశం ఇంకా కోలుకోలేదు. ఈ తరుణంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి, ఐఎంఎఫ్ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.దీంతో పాక్ లో రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-02-14T11:14:52+05:30 IST