Share News

Karachi: దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం? కరాచీ ఆసుపత్రిలో చేరిన అండర్ వరల్డ్ డాన్

ABN , Publish Date - Dec 18 , 2023 | 08:20 AM

పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) పాకిస్థాన్ లోని కరాచీ(Karachi) ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. . విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

Karachi: దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం? కరాచీ ఆసుపత్రిలో చేరిన అండర్ వరల్డ్ డాన్

కరాచీ: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) పాకిస్థాన్ లోని కరాచీ(Karachi) ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. . విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు. సంబంధిత ఆసుపత్రిలో గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.

1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్‌లో ఉంటున్నాడు. ముంబై దాడుల్లో 250 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల ప్రణాళిక, అమలులో అతని ప్రమేయం ఉందన్న ఆరోపణలలో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడిగా దావూద్ ఉన్నాడు.


2008లో 26/11 ఉగ్రదాడుల సమయంలో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులకు దావూద్ ముంబైలో ఉన్న తన నెట్‌వర్క్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని భారత్ సాక్ష్యాలను సమర్పించినప్పటికీ అతనికి తాము ఆశ్రయం ఇవ్వలేదని పాక్ తిరస్కరిస్తూ వస్తోంది.

ముంబై పోలీసులు దావూద్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు అలీషా పార్కర్ , సాజిద్ వాగ్లే నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు యత్నిస్తున్నారు. అతను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని సోదరి హసీనా పార్కర్ కుమారుడు ఎన్ఐఏకి వివరించాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, దోపిడీ, ఆయుధాల స్మగ్లింగ్ వంటి నేర కార్యకలాపాలలో పాల్గొన్నాడు. అతన్ని చంపితే 25 మిలియన్ డాలర్లు ఇస్తామని గతంలో భారత్ ప్రకటించింది. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి.

"మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 18 , 2023 | 08:22 AM