Share News

China Fastest Internet: చైనా మరో సంచలనం.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌

ABN , First Publish Date - 2023-11-15T17:12:57+05:30 IST

‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే’ అనే బాలయ్య డైలాగ్ చైనా దేశానికి సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇప్పటివరకూ అది ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాని ఎన్నో ఆవిష్కరణలను సృష్టించింది. అసాధ్యం అనుకున్న పనులను..

China Fastest Internet: చైనా మరో సంచలనం.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌

‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే’ అనే బాలయ్య డైలాగ్ చైనా దేశానికి సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇప్పటివరకూ అది ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాని ఎన్నో ఆవిష్కరణలను సృష్టించింది. అసాధ్యం అనుకున్న పనులను ఆ దేశం సుసాధ్యం చేసి చూపించింది. ఇప్పుడు తాజాగా మరో చారిత్రాత్మక ఫీట్ సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్' నెట్‌వర్క్‌ను ఆవిష్కరించింది. ఈ నెట్‌వర్క్ కేవలం ఒక్క సెకనులో 1.2 టెరాబైట్స్ (150 సినిమాలకు సమానం) డేటాను ట్రాన్స్‌మిట్ చేయగలదు. ప్రస్తుతం వినియోంలో ఉన్న ఇంటర్నెట్ రూట్స్‌తో పోలిస్తే.. ఇది పది రెట్లు వేగంగా పని చేస్తుందని ఓ మీడియా కథనం వెల్లడించింది. సింగ్వా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువాయ్ టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ సంస్థలు కలిసి.. ఈ ప్రాజెక్ట్‌ని అభివృద్ధి చేశాయి. బీజింగ్‌, వుహాన్‌, గ్వాంగ్జూలను కలుపుతూ.. ప్రత్యేకమైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ సాయంతో ఈ నెట్‌వర్క్‌ను 3,000 కి.మీ. మేరరే ఏర్పాటు చేశారు.


ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ప్రధాన నెట్‌వర్క్‌లు కేవలం ఒక సెకనుకు 100 గిగాబైట్ల డేటాను మాత్రమే ట్రాన్స్‌మిట్‌ చేస్తున్నాయి. ఇటీవల అమెరికాలో ప్రారంభించిన 5వ జనరేషన్‌ ఇంటర్నెట్‌-2లోనూ అత్యధికంగా ఓ సెకనుకు 400 గిగాబైట్ల వేగంతో డేటాను ప్రసారం చేయగలుగుతోంది. ఇప్పుడు చైనా సంస్థలు అంతకుమించిన వేగంతో నడిచే ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ని ఆవిష్కరించి, సరికొత్త సంచలనానికి పునాది వేశాయి. ఫ్యూచర్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగానే.. బీజింగ్, వుహాన్, గ్వాంగ్జూ కనెక్షన్‌ను ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థలు తెలిపాయి. దీనిని జులైలో అధికారికంగా యాక్టివేట్ చేశారు. తాజాగా సోమవారం దీనిని ప్రారంభించారు. ఈ నెట్‌వర్క్‌ అన్ని రకాల ఆపరేషనల్‌ టెస్ట్‌లను పూర్తి చేసుకొని.. ఎలాంటి అవాంతరాలు లేకుండా సమర్థవంతంగా పని చేస్తోంది.

ఈ నెట్‌వర్క్‌ పనితీరును హువావే టెక్నాలజీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వాంగ్‌ లీ వివరిస్తూ.. ఇది 150 హెచ్‌డీ సినిమాలకు సమానమైన డేటాని ఒక్క సెకనులోనే పంపించగలదని తెలిపారు. చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన ఫిటి (FITI) ప్రాజెక్ట్ లీడర్ వూ జియాన్‌పింగ్ మాట్లాడుతూ.. సూపర్‌ఫాస్ట్ లైన్ కేవలం వాణిజ్య కార్యకలాపాలకే కాదని, భవిష్యత్తులో మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌ను నిర్మించే అధునాతన సాంకేతికతను కూడా అందిస్తుందని చెప్పారు. అటు.. సింఘువా యూనివర్సిటీకి చెందిన జూ మింగ్‌వీ ఈ కొత్త ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను సూపర్‌ఫాస్ట్ రైలు ట్రాక్‌తో పోల్చారు. 10 సాధారణ ట్రాక్‌లో తీసుకెళ్లే డేటాను ఇది ఒకేసారి భర్తీ చేస్తుందన్నారు.

Updated Date - 2023-11-15T17:12:59+05:30 IST