Share News

Bangladesh: బంగ్లాదేశ్‌లో 150 వస్త్ర దుకాణాలు మూసివేత.. వేతనాలు పెంచాలంటూ నిరసనలు

ABN , First Publish Date - 2023-11-11T17:54:04+05:30 IST

Dhaka: కనీస వేతనాలు(Minimum Wages) పెంచాలంటూ డిమాండ్ చేస్తున్న బంగ్లాదేశ్(Bangladesh) కార్మికుల ఆందోళనలతో ఇవాళ 150 దుకాణాలను వస్త్ర దుకాణాలను యజమానులు నిరవధికంగా మూసేశారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో 150 వస్త్ర దుకాణాలు మూసివేత.. వేతనాలు పెంచాలంటూ నిరసనలు

ఢాకా: కనీస వేతనాలు(Minimum Wages) పెంచాలంటూ డిమాండ్ చేస్తున్న బంగ్లాదేశ్(Bangladesh) కార్మికుల ఆందోళనలతో ఇవాళ 150 దుకాణాలను వస్త్ర దుకాణాలను యజమానులు నిరవధికంగా మూసేశారు. 2009 నుంచి అప్రతిహాతంగా అధికార పీఠంపై కొనసాగుతున్న ప్రధాని షేక్ హసీనాకు(Shaik Hasina) ఈ నిరసనలు పెనుసవాలుగా మారాయి. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గత నెలలో కార్మికులు(Labours) నిరసనలు చేపట్టారు. ఇవి కాస్తా హింసాత్మకంగా మారడంతో 11 వేల మంది కార్మికులకు పోలీసులు బ్లాంకెట్ ఛార్జీలు జారీ చేశారు.

బంగ్లాదేశ్ లోని 3,500 గార్మెంట్ ఫ్యాక్టరీలు దాని వార్షిక ఎగుమతులలో 85 శాతం వాటాను కలిగి ఉన్నాయి. లెవీస్, జారా, H&Mతో సహా ప్రపంచంలోని అనేక అగ్ర బ్రాండ్‌ దుస్తుల్ని సరఫరా చేస్తాయి. అయితే ఈ రంగంలోని నాలుగు మిలియన్ల కార్మికులలో చాలా మంది పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది మహిళలు నెలవారీ వేతనం 8,300 టాకా ($75)(రూ.6,247) వరకు పొందుతున్నారు. గత నెలలో జరిగిన నిరసనల్లో ముగ్గురు కార్మికులు మరణించారు.


70 ఫ్యాక్టరీలు దోపిడీకి గురయ్యాయి. ప్రభుత్వం నియమించిన ప్యానెల్ మంగళవారం సెక్టార్ వేతనాన్ని 56.25 శాతానికి ఫిక్స్ చేసి 12,500 టాకాలకు పెంచింది. అయితే గార్మెంట్ కార్మికులు 23,000 టాకా కనీస వేతనం డిమాండ్ చేస్తూ ప్యానెల్ నిర్ణయాన్ని తిరస్కరించారు. 15,000 మంది కార్మికులు కీలకమైన రహదారిపై గురువారం పోలీసులతో ఘర్షణ పడ్డారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలు జనవరి నెలాఖరులో జరిగే ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని అస్త్రంగా మలచుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. కార్మికుల సమ్మెలకు భయపడి శనివారం ఢాకాకు ఉత్తరాన ఉన్న అషులియా, గాజీపూర్ లోని ప్రధాన పారిశ్రామిక పట్టణాల్లో 150 ఫ్యాక్టరీలు మూతపడ్డాయని పోలీసులు తెలిపారు.

వీటిల్లో 15 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. కర్మాగారాలపై ఇటుకలు, రాళ్లతో దాడి చేసినప్పుడు పోలీసులు కార్మికులపై రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక జోన్‌గా ఉన్న గాజీపూర్‌లో 20 ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయని పోలీసు చీఫ్ మహ్మద్ సరోవర్ ఆలం తెలిపారు. షేక్ హసీనా మాత్రం వేతనాల పెంపుదలపై వెనకడుగేస్తున్నారు. నిరసనలు తెలిపితే ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరిస్తున్నారు. 'ఎవరో ప్రోద్బలంతో నిరసనలు తెలిపితే ఉద్యోగం పోతుంది. పని పోతుంది. తిరిగి మీ గ్రామాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ ఫ్యాక్టరీలు మూతబడి, ఉత్పత్తికి, ఎగుమతులకు అంతరాయం కలిగితే, వారి ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? వారు అర్థం చేసుకోవాలి' అని హసీనా హెచ్చరించారు. కాగా నిరసన చేస్తున్న కార్మికులపై హింసను వాషింగ్టన్ ఖండించింది. బంగ్లాదేశ్ వస్త్రాలను అత్యధికంగా కొనుగోలు చేసే దేశాలలో అమెరికా ఒకటిగా ఉంది. వేతనాల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.

Updated Date - 2023-11-11T17:56:52+05:30 IST