Share News

Health tips: మధుమేహం అదుపులో ఉండాలంటే..!

ABN , First Publish Date - 2023-10-14T14:14:55+05:30 IST

వాతావరణంలో అనూహ్యంగా వస్తోన్న మార్పుల కారణంగా కొన్నిసార్లు చలిగా, మరొకొన్నిసార్లు వేడిగా, ఇంకొన్ని సార్లు పొడిగా ఉంటోంది. తీవ్ర ఉక్కబోతతో శరీరం డీ హైడ్రేషన్‌కు లోనవుతోంది. దానిని నుంచి ఉపశమనం పొందేందుకు

Health tips: మధుమేహం అదుపులో ఉండాలంటే..!

  • డీహైడ్రేషన్‌ నుంచి ఉపశమనం

  • సబ్జా గింజల్లో ఖనిజ లవణాలు

  • టైప్‌- 2 మధుమేహం అదుపులో

  • జీర్ణక్రియల పనితీరు మెరుగు

వాతావరణంలో అనూహ్యంగా వస్తోన్న మార్పుల కారణంగా కొన్నిసార్లు చలిగా, మరొకొన్నిసార్లు వేడిగా, ఇంకొన్ని సార్లు పొడిగా ఉంటోంది. తీవ్ర ఉక్కబోతతో శరీరం డీ హైడ్రేషన్‌కు లోనవుతోంది. దానిని నుంచి ఉపశమనం పొందేందుకు కూల్‌డ్రింక్స్‌ తాగుతోంటారు. అయితే ఈ కూల్‌ డ్రింక్స్‌ వలన ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతాయని, వాటికి బదులుగా సబ్జా గింజలు నీళ్లల్లో నానబెట్టి, దానిలో షుగర్‌ కల్పుకుని తాగితే మేలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో నేటి తరం చాల మంది పిల్లలకు పెద్దగా సబ్జాగింజల గురించి తెలియదు. వీటినే తుక్మారియా లేదా తులసి గింజలు అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఎండకాలం వచ్చిందంటే.. వేడీ తవ్రత తగ్గించుకునేందుకు సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టి, దానికి కొంచెం పంచదార కల్పుకుని తాగేవారు. దాంతో ఒంట్లో వేడి పూర్తిగా తగ్గిపోయేది. అయితే ఇవేమీ పట్టించుకోని నేటి తరం పిల్లలు మార్కెట్లో లభిస్తున్న థమ్స్‌ప్‌, రస్నా, పెప్సీలు తాగి ఆర్యోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చలువచేసే పదార్ధాలను చాలామంది తీసుకుంటారు. వేసవిలో సబ్జాగింజలతో అనేక లాభాలు ఉన్నాయి. ఇవి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. హిందువులు పవిత్రంగా భావించే తులసిని పోలిన మొక్క నుంచి వచ్చే సబ్జాగింజలతో పలు ప్రయోజనాలున్నాయి. సబ్జాగింజల్లో ప్రోటీన్స్‌, పిండిపదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. తక్కువ కేలరీలు ఉంటాయి. సబ్జాగింజలను పచ్చిగా తినలేరు. నీటిలో నానబెట్టిన తరువాత తీసుకొంటే వాటిలోని ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.

అధిక బరువుతో బాధపడుతున్నారా?

సబ్జా గింజలను నీళ్ళలో నానబెట్టి తాగండి. నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ నీరు యాంటీబయాటిక్‌లా పనిచేస్తుంది. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలనూ నివారిస్తుంది. నీటిని రాత్రిపూట తాగడం వలన తెల్లవారేసరికి శరీరంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. ఈ నీరు టైఫ్‌- 2 మధుమేహాన్నీ అదుపులో ఉంచుతుంది. దాహర్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా కాపాడుతుంది. శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జా గింజలు పెట్టింది పేరు. సబ్జాగింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీర్ణక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి అవి ఉబ్బి జెల్‌మాదిరిగా తయారఅవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతో పాటు పీచుని ఎక్కువగా కలిగివుంటాయి. ఇందులో మహిళలకు అవసరమైన ఫాలేట్‌, నియాసిన్‌, చర్మాన్ని అందంగా ఉంచే ‘ఈ’ విటమిన్‌ ఉంటుంది.

సబ్జా గింజల పానీయంతో ఆరోగ్యం..

  • సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగితే

    శరీరంలోని వేడి మాయం అవుతుంది.

  • రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి.

  • డీహైడ్రేషన్‌కు గురికారు

  • జీర్ణ సమస్యలు దరిచేరవు

  • శరీరం బరువు అదుపులో ఉంటుంది.

  • పిల్లలకు తాగాస్తే యాక్టివ్‌గా ఉంటారు.

ఉపయోగాలు..

  • సబ్జా గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కొత్త చర్మకణాలకు అవసరమైన కొల్లాజెన్‌ స్రవిస్తుంది.

  • సబ్జాగింజల్లో ఉండే యాంటిస్పాస్మోడిక్‌ లక్షణాలు కండరాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కండరాలకు విశ్రాంతినిస్తాయి.

  • కోరింత దగ్గును నియంత్రించడానికి ఔషధంగా సబ్జాగింజలు పనిచేస్తాయి.

  • సబ్జాగింజలు నానబెట్టినప్పుడు ఎనిమిది రెట్ల నీటిని గ్రహిస్తాయి. వీటిని తీసుకోవడం వలన శరీరానికి నీటి శాతం ఎక్కువగా లభిస్తుంది.

  • సబ్జా గింజల్లో ఖనిజ లవణాలు ఉన్నాయి. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫైబర్‌, పాస్పరస్‌, మల్టీవిటమిన్లు ఉంటాయి.

  • దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాంటీ ప్సాస్మోడిక్‌ లక్షణాలు ఉంటాయి.

  • కొబ్బరి నూనెలో పిండిచేసిన గింజలను కలిపి ఆ నూనెను చర్మం, జుట్టుకు పట్టిస్తే సమస్య తగ్గుతుంది.

  • మలబద్దకం, కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

  • అసిడిటీ, ఛాతిలో మంటను సబ్జా గింజలతో అరికట్టవచ్చు

  • బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

  • లెవల్స్‌ తగ్గించడంలో ఉపయోగపడుతాయి.

పిల్లలకు తప్పకుండా తాగించాలి

ఎండ వేడిమిని తట్టుకోవడానికి సబ్జా గింజలు ఎంతో ఉపయోగపడతాయి. మార్కెట్‌లో లభించే సబ్జా గింజలను రాత్రివేళ నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే మంచి ఫలితం ఉంటుంది. పనులు చేసేవారు సాయంత్రం ఒక గ్లాసుడు సబ్జాగింజల పానీయం తాగితే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలోని వేడిని మటుమాయం అవుతుంది. పిల్లలకు తప్పక తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

- డాక్టర్‌ మహేందర్‌, పిల్లల వైద్యుడు

హైదరాబాద్, షాపూర్‌నగర్‌, అక్టోబర్‌ 13 (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2023-10-14T14:14:55+05:30 IST