Sleep: నిద్ర పట్టడం లేదా..? అయితే కారణమిదే!

ABN , First Publish Date - 2023-03-30T11:11:55+05:30 IST

ప్రతి రోజు క్రమం తప్పకుండా నిద్రపోతూ ఉంటే హార్మోన్‌ సమస్యలు ఉండవంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఎప్పుడైనా ఈ హార్మోన్లు అదుపుతప్పినప్పుడు నిద్రలేమి

Sleep: నిద్ర పట్టడం లేదా..? అయితే కారణమిదే!
hormones

ప్రతి రోజు క్రమం తప్పకుండా నిద్రపోతూ ఉంటే హార్మోన్‌ సమస్యలు ఉండవంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఎప్పుడైనా ఈ హార్మోన్లు అదుపుతప్పినప్పుడు నిద్రలేమి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. అసలు హార్మోన్లు మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూద్దాం..

  • ప్రోజిస్టిరోన్‌ అనే హార్మోన్‌ విలువలు తక్కువగా ఉంటే నిద్ర తక్కువగా పడుతుంది. ఇదే విధంగా ఓస్ట్రోజెన్‌ విలువలు తక్కువగా ఉన్నా సరైన నిద్ర పట్టదు. మధ్యలో మెలుకువ వచ్చేస్తుంది.

  • మోనోపాజ్‌ లేదా ప్రీమోనోపాజ్‌ స్థితిలో ఉన్న మహిళలలో నిద్ర లేమి ఎక్కువగా ఉంటుంది. వీరికి నిద్ర ఎక్కువగా పట్టదు. ఒక వేళ పట్టినా- వెంటనే మెలుకువ వచ్చేస్తుంది. దీనికి మిలోటోనిన్‌ అనే హార్మోన్‌ కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ హార్మోన్‌ - రుతుస్రావాన్ని క్రమబద్దీకరించటంలో కూడా ఒక ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఏం చేయాలి?

  • ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవటానికి ప్రయత్నించాలి.

  • మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కెఫిన్‌ ఉన్న ద్రవాలేమి తాగకూడదు

ప్రతి రోజూ ఎక్సర్‌సైజ్‌ చేయాలి.

  • మొబైల్‌ఫోన్స్‌, లాప్‌టా‌ప్‌లను దూరంగా ఉంచాలి. ఒక సారి మంచం మీదకు వెళ్లిన తర్వాత మొబైల్స్‌ను చూసే అలవాటును మానుకోవాలి. మొబైల్స్‌ లేదా లాప్‌టాప్స్‌ నుంచి వచ్చే కాంతి మన శరీరంలోని మిలోటోనిన్‌ హార్మోన్‌పై ప్రభావం చూపిస్తాయి.

Updated Date - 2023-03-30T11:11:55+05:30 IST