Vegetable Rind: తొక్కే కదా అని తీసిపారేయద్దు!

ABN , First Publish Date - 2023-10-12T15:08:55+05:30 IST

చాలా మంది కూరగాయల తొక్కను తీసి పారేస్తూ ఉంటారు. అయితే తొక్కలో కూడా అనేక పౌష్టిక విలువలు ఉన్నాయని.. వాటిని తీసి పారేయటం వల్ల అవి పోతాయని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు..

Vegetable Rind: తొక్కే కదా అని తీసిపారేయద్దు!

చాలా మంది కూరగాయల తొక్కను తీసి పారేస్తూ ఉంటారు. అయితే తొక్కలో కూడా అనేక పౌష్టిక విలువలు ఉన్నాయని.. వాటిని తీసి పారేయటం వల్ల అవి పోతాయని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు..

ఆలుగడ్డలు: ఆలుగడ్డల పైనుండే తొక్కలో పొటాషియం, ఐరన్‌లు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. ఎర్రరక్తకణాలు ఆరోగ్యవంతంగా పనిచేయటానికి ఐరన్‌ ఉపకరిస్తుంది. అందువల్ల ఆలుగడ్డలపై ఉన్న తొక్కను తీయకుండా వండుకుంటే మంచిది. అయితే వండే ముందు మాత్రం బాగా కడుక్కొవాలి.

క్యారెట్‌లు: చాలా మంది క్యారెట్‌ను తొక్కతో సహా తింటారు. కేరెట్‌ తొక్కల్లో- యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ సి, బీ3, డైటరీ ఫైబర్‌, ఫైదోన్యూట్రెంట్స్‌ ఉంటాయి. ఫైదో న్యూట్రెంట్స్‌ - రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. చర్మం మెరిసేలా చేస్తాయి. అందువల్ల క్యారెట్‌లను తొక్క తీయకుండా తింటే మంచిది.

దోసకాయలు: దోసకాయల తొక్కల్లో విటమిన్‌ కెతో పాటుగా సిలికా కూడా ఉంటుంది. విటమిన్‌ కె రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. సిలికా వల్ల చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వంకాయలు: చాలా మంది వంకాయి పచ్చడిని ఇష్టపడతారు. దీనిలో వంకాయపైనున్న తొక్కను తీసేస్తారు. కానీ ఈ తొక్కలో నాసునిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది మన మెదడులోని కణాలను ఒత్తిడికి లోనుకాకుండా చేస్తుంది. ఆహారం జీర్ణం కావటానికి కూడా ఇది ఉపకరిస్తుంది.

Updated Date - 2023-10-12T15:13:06+05:30 IST