Kids Care: పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి! లేదంటే..!

ABN , First Publish Date - 2023-03-15T14:55:37+05:30 IST

వేసవి (Summer) లో పిల్లలు (Kids Care) ఎక్కువగా ఎండదెబ్బకు గురవుతారు. ఆరుబయట ఆటలాడుతూ, దాహం వేసినా నీళ్లు తాగకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల పదేళ్ల

Kids Care: పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి! లేదంటే..!
ఓ కన్నేసి ఉంచండి

వేసవి (Summer) లో పిల్లలు (Kids Care) ఎక్కువగా ఎండదెబ్బకు గురవుతారు. ఆరుబయట ఆటలాడుతూ, దాహం వేసినా నీళ్లు తాగకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల పదేళ్ల లోపు పిల్లలు తేలికగా ఎండ దెబ్బకు గురవుతూ ఉంటారు. కాబట్టి పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచాలి. సరిపడా నీళ్లు తాగుతున్నారో, లేదో గమనించుకుంటూ ఉండాలి. తాజా కూరగాయలు, పప్పు, పెరుగు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మసాలాలు, కారాలు ఈ కాలంలో తగ్గించి, పండ్ల రసాలు, క్యారెట్‌ జ్యూస్‌, మజ్జిగ, రాగి జావ, కొబ్బరి నీళ్లు ఇస్తూ ఉండాలి.

ఇవి వద్దు: శీతల పానీయాలు, జంక్‌ ఫుడ్‌ పిల్లలు తినకుండా చూసుకోవాలి. చక్కెర ఒంట్లోని నీటిని పీల్చుకుని, డీహైడ్రేషన్‌కు గురి చేస్తుంది. కాబట్టి తీయగా ఉండే పానీయాలు, తీపి పదార్థాలకు పిల్లలను దూరం పెట్టాలి. బడికి వెళ్లే పిల్లలకు స్నాక్‌గా బిస్కెట్లకు బదులుగా పండ్ల ముక్కలను అందించాలి. డీప్‌ ఫ్రీజర్‌లో చల్లబరిచిన నీళ్లు కాకుండా, ఫ్రిజ్‌లో డోర్‌లో ఉంచిన నీళ్లు తాగించడం మేలు.

ఈ లక్షణాలు గమనించాలి: పిల్లలు నీరసంగా కనిపించినా, ఎక్కువ సమయం పాటు పడుకునే ఉంటున్నా, వాంతులు చేసుకుంటున్నా డీహైడ్రేషన్‌కు గురయినట్టు భావించాలి. శరీరం వేడిగా ఉందేమో పరీక్షించి, చల్లని నీళ్లలో తడిపి పిండిన క్లాత్‌తో ఒళ్లు తుడవాలి. చక్కెర, కొద్దిగా ఉప్పు కలిపిన ఓఆర్‌ఎస్‌ తాగించాలి. మార్కెట్లో దొరికే ఓఆర్‌ఎస్‌ పానీయాల్లో చక్కెర శాతం ఎక్కువ. కాబట్టి టెట్రా ప్యాక్‌లకు బదులుగా పొడి రూపంలో ఉండే ఓఆర్‌ఎస్‌లనే ఎంచుకోవాలి.

Updated Date - 2023-03-15T14:55:37+05:30 IST