Deepavali 2023: దీపావళికి కాల్చే బాంబుల వల్ల.. గర్భంతో ఉన్న వాళ్లకు ఇలాంటి సమస్యలా..? డాక్టర్లు చెబుతున్న నిజాలివీ..!
ABN , First Publish Date - 2023-11-13T15:35:06+05:30 IST
దీపావళినాడు కాల్చే పటాసుల మోతలు, వాయు కాలుష్యాన్ని మరింత పెంచుతాయి. ఇలాంటి సందర్భంలో స్త్రీలు బహిరంగ వాతావరణంలో తిరగకుండా ఇంటి పట్టునే ఉండాలి.

దీపావళి రోజున పెరుగుతున్న కాలుష్యం వల్ల ఆస్తమా వ్యాధిగ్రస్థులే కాక, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలకు కూడా ఇబ్బందే. కడుపులోని శిశువు, అనారోగ్యానికి గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది. దీపావళి సందర్భంగా వాయు కాలుష్యం గణనీయంగా పెరుగుతూ ఉంది. ఢీల్లీ లాంటి ప్రదేశంలో ఎన్‌సిఆర్‌లో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ విషయంగా ప్రతి ఒక్కరిలోనూ అవగాహన అవసరం. దీపావళి సమయంలో గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే, వాయుకాలుష్యం గర్భిణిల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో గర్భిణీపై వాయు కాలుష్య ప్రభావం...
వాయు కాలుష్యం ప్లాసెంటా ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పిల్లల ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో అనేక వ్యాధులు, రుగ్మతల బారిన పడేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి: చర్మంపై ఇలాంటి మచ్చలు కనిపిస్తున్నాయా..? అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క..!
పిల్లలపై వాయుకాలుష్యం ప్రభావం వల్ల..
పొగమంచులా అల్లుకునే వాయు కాలుష్యం పొగాకు, ఇంటి లోపల లేదా ఆరు బయట కాల్చినా కూడా విషపూరిత పదార్థాలు వాయుకాలుష్యానికి కారణం అవుతాయి. ఈ రసాయనాలకు తోడు, దీపావళినాడు కాల్చే పటాసుల మోతలు, వాయు కాలుష్యాన్ని మరింత పెంచుతాయి. ఇలాంటి సందర్భంలో స్త్రీలు బహిరంగ వాతావరణంలో తిరగకుండా ఇంటి పట్టునే ఉండాలి. ఇంట్లో HEPA ఫిల్టర్ తో కూడిన ఎయిర్ ఫ్యూరిఫైయర్ ని ఉపయోగించాలి. ఇండోర్ ఎయిర్ క్యాలిటీ HEPA ఫిల్టర్ వాడటంతో మెరుగుపడుతుంది.
గర్భిణీ స్త్రీ కుటుంబంలో పటాకుల మోత ఉండకపోవడం, ఆరోజు పటాకులు కాల్చకపోవడం మంచిది. బయటి నుంచి పొగ, కాలుష్యం పీల్చే వీలు లేకుండా N95, N99 మాస్క్ వేసుకోవడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కడుపులోని బిడ్డకు వాయుకాలుష్యం ప్రమాదం తగ్గవచ్చు.