Share News

Skin: చర్మంపై ఇలాంటి మచ్చలు కనిపిస్తున్నాయా..? అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క..!

ABN , First Publish Date - 2023-11-13T14:21:18+05:30 IST

గోధుమ రంగు గుండ్రని మచ్చలుగా, గీతలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇవి మధుమేహం ఉన్నవారిలో సర్వసాధారణంగా కనిపిస్తాయి.

Skin: చర్మంపై ఇలాంటి మచ్చలు కనిపిస్తున్నాయా..? అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క..!
beneath the skin

శరీరంలో అతి పెద్ద అవయవం మన చర్మమే.. అయితే చర్మం మీద వచ్చే మచ్చలూ, గాయాల మచ్చల వెనుక అకాంథోసిస్ మైగ్రికన్ అని పిలిచే మచ్చలు కూడా కావచ్చు. ఇవి తగ్గాలంటే మాత్రం శరీరంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుకోవాల్సిందే. లేదంటే చాలా పెద్ద ప్రమాదమే జరగబోతుందని అర్థం. ఇది చర్మంలో జరుగుతున్న మార్పులకు సంకేతం కూడా కావచ్చు.

అకాంథోసిస్ మైగ్రికన్..

ఈ సమస్యలో, చర్మంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి, ఇవి మెడ, చంకలు, నడుము వంటి ప్రదేశాలలో కనిపిస్తాయి. కొన్నిసార్లు చేతులు, మోచేతులు, మోకాళ్లపై కూడా పాచెస్ కనిపించవచ్చు. ఈ మచ్చలు చర్మంలో ఎరుపు లేదా గోధుమ రంగు గుండ్రని మచ్చలుగా, గీతలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇవి మధుమేహం ఉన్నవారిలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. అవి కాళ్ల ముందు భాగంలో కనిపిస్తాయి. తరచుగా వయస్సు మచ్చలు అనుకుంటారు కానీ ఈ మచ్చలు బాధగానీ, దురదగానీ ఉండవు. ఈ మచ్చల కారణంగా ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

ఇదికూడా చదవండి: ఎంత తిన్నా.. అస్సలు లావు పెరగడం లేదా..? బక్కగా ఉన్నవాళ్లు ఈ 10 ఆహార తింటే..!


చర్మం దురద..

డ్రై, దురద చర్మం ఇబ్బంది పెట్టే సమస్య. అయితే ఎలాంటి చర్మ సంబంధిత సమస్యనైనా తేలిగ్గా తీసుకోకూడదు. పొడి, దురద చర్మం అనేక కారణాలు కావచ్చు. డయాబెటిస్ ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ఉంటుంది.

ఎలా కంట్రోల్ చేయాలంటే..

షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడం తర్వాత, వీలైనంత వరకు తేలికపాటి సబ్బును ఉపయోగించడం, స్నానం చేసిన తర్వాత మంచి నాణ్యమైన బాడీ లోషన్ ఉపయోగించడం కూడా సహాయపడుతుంది. దీనితో పాటు, వ్యాయామం కూడా తప్పనిసరి. ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.

Updated Date - 2023-11-13T14:21:26+05:30 IST