Liver: ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ రక్షణ పొందవచ్చు! ఎలా అంటే..!

ABN , First Publish Date - 2023-07-25T17:20:41+05:30 IST

కాలేయం కులాసాగా ఉంటేనే మొత్తం ఆరోగ్యం కులాసాగా ఉంటుంది. కాబట్టి కాలేయం కుదేలవకుండా ఉండాలంటే హెపటైటిస్‌ నుంచి రక్షణ పొందాలి. అందుకోసం కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి.

Liver: ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ రక్షణ పొందవచ్చు! ఎలా అంటే..!

కాలేయం కులాసాగా ఉంటేనే మొత్తం ఆరోగ్యం కులాసాగా ఉంటుంది. కాబట్టి కాలేయం కుదేలవకుండా ఉండాలంటే హెపటైటిస్‌ నుంచి రక్షణ పొందాలి. అందుకోసం కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి.

హెపటైటిస్‌ ఎందుకు?

హెపటైటిస్‌ ఎ, బి, సి, డి, ఇ వైర్‌సలు కాలేయ ఇన్‌ఫెక్షన్‌ను కలగజేస్తాయి. ఈ వైర్‌సలే కాకుండా మితిమీరిన, దీర్ఘకాల మద్యపానం, కొన్ని రకాల మందులు, ఊబకాయం కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి. కాలేయం వ్యాధికి గురైతే మొదట కనిపించే లక్షణం ‘కామెర్లు’. అయితే కామెర్లకు కారణం, వైరస్‌ రకాలను గుర్తించి అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. కలుషిత ఆహారం, నీరు, వ్యాధి ఉన్న రక్తం ఎక్కించుకోవటం ద్వారా హెపటైటిస్‌ వైర్‌సలు సోకుతాయి. అయితే ఈ వైర్‌సలు శరీరంలో చేరి వ్యాధిగా బయల్పడటానికి కొంత సమయం పడుతుంది. హెపటైటిస్‌ ఎ, ఇ వైర్‌సల లక్షణాలు బయల్పడడానికి రెండు నుంచి ఆరు నెలలు సమయం పడితే, హెపటైటిస్‌ బి, సి వైర్‌సలకు 8 నుంచి 26 వారాల సమయం పడుతుంది. వైరస్‌ లేదా మద్యపానం ఏ కారణం వల్ల కాలేయం రోగగ్రస్థమైనా తక్షణ చికిత్స తీసుకోవటం అత్యవసరం.

నివారణ మన చేతుల్లోనే!

  • కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కాలేయాన్ని వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. అవేంటంటే...

  • పరిశుభ్రమైన నీరు తాగాలి.

  • రివర్స్‌ ఆస్మోసిస్‌ లేదా యు.వి వాటర్‌ ఫిల్టర్లు వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది.

  • వీధుల్లో దొరికే పళ్ల రసాలు, తినుబంఢారాలకు దూరంగా ఉండాలి.

  • సలూన్లలో, బార్బర్‌ షాపల్లో ఇతరులకు వాడినది కాకుండా కొత్త బ్లేడునే ఉపయోగించాలి.

  • బ్యూటీ పార్లర్లలో ఉపయోగించే పరికరాలు డిస్పోజబుల్‌ తరహావై ఉండాలి.

  • హెపటైటిస్‌ బి, సి వైర్‌సలు లైంగిక సంబంధాల వల్ల కూడా సోకుతాయి. కాబట్టి తగినంత ప్రొటెక్షన్‌ తీసుకోవాలి.

  • ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్‌ తీసుకోవటం హెపటైటిస్‌ సోకటానికి మరో ప్రధాన కారణం.

  • హెపటైటిస్‌ వైర్‌సల నుంచి రక్షణ పొందటం కోసం టీకాలను ఆశ్రయించాలి.

  • కాయగూరలు, పళ్లను ఎక్కువ నీళ్లతో శుభ్రంగా కడిగి వాడాలి.

లక్షణాలే కీలకం

చర్మం దురదలు, కళ్లు, మూత్రం పచ్చబడటం, ఆకలి లేకపోవటం, వాంతులు, ఒళ్లు నొప్పులు, నిస్సత్తువ... ఇవీ కామెర్ల లక్షణాలు. కొందరు కామెర్లు వస్తే పత్యం ఉండటం, నాటు మందులు వాడటం చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. కామెర్లకు మూల కారణం తెలుసుకోకుండా స్వీయ చికిత్స తీసుకోవటం వల్ల వైరస్‌ మూలంగా కాలేయ కణాలు త్వరితగతిన చనిపోతూ తిరిగి సరిదిద్దలేని స్థితికి కాలేయం చేరుకోవచ్చు. మొదట స్కారింగ్‌, తర్వాత సిర్రోసి్‌సకు దారితీసి అప్పటికీ చికిత్స అందకపోతే లివర్‌ ఫెయిల్యూర్‌ కూడా జరగవవచ్చు. కాబట్టి కామెర్ల లక్షణాలు కనిపించగానే సొంత వైద్యం మానుకుని వైద్యుల్ని కలవాలి.

Updated Date - 2023-07-25T17:20:41+05:30 IST